నిజామాబాద్ జిల్లా నవీపేటలో శారద (510, సంజయ్ దంపతులు నివాసం ఉండేవారు. వీరికి మానిక(26) అనే కూతురు కూడా ఉంది. అయితే గత నాలుగు ఏళ్ల కిందటే శారద భర్త సంజయ్ చనిపోయాడు. దీంతో శారద అప్పటి నుంచి ఉన్న కూతురును చూసుకుంటూ ఉండేది. ఇదిలా ఉంటే కూతురు మౌనిక ఎంబీఏ చదివి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంది. ఇక గ్రామంలో తల్లి ఒంటరిగా ఉండడంతో మౌనిక తన తల్లిని కూడా హైదరాబాద్ కు తీసుకొచ్చి నగరంలోని అల్వాల్ నివాసం ఉంటున్నారు. కూతురు కొంత కాలం పాటు ఉద్యోగం చేస్తూ తల్లీకూతుళ్లు సంతోషంగానే ఉన్నారు. కానీ ఉద్యోగం ఒత్తిడిని భరించలేక మౌనిక గతంలో ఉద్యోగం మానేసింది.
అప్పటి నుంచి మౌనిక తల్లి శారద నగరంలో స్థానికంగా ఓ చోట పని చేస్తూ సంసారాన్ని నెట్టుకొచ్చింది. ఇక తండ్రి లేకపోవడంతో కుటుంబం భారం మొత్తాన్ని శారద తన బుజాలపై వేసుకుంది. ఈ క్రమంలోనే తల్లి పడుతున్న బాధను చూడలేక కూతరు మౌనిక తీవ్ర మనస్థాపానికి లోనైంది. నేను తల్లికి భారం కాకూడదని ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల మౌనిక తల్లి పనికి వెళ్లిన అనంతరం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇక సాయంత్రం తల్లికి ఇంటికి వచ్చి చూసే సరికి కూతురు ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఈ సీన్ ను చూసిన తల్లి ఒక్కసారిగా షాక్ గురై శోక సంద్రంలో మునిగిపోయింది.
కూతురు మృతిని తట్టుకోలేని తల్లి శారద సైతం ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. అయితే ఎందుకో అనుమానం వచ్చిన శారద కుటుంబ సభ్యులు తల్లీకూతుళ్లకు ఫోన్ చేశారు. ఇద్దరూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వీరి అనుమానం మరింత బలపడింది. ఏద జరిగిందంటూ వారు కుటుంబ సభ్యులు తల్లీకూతుళ్లు ఉంటున్న ఇంటికి వచ్చారు. వచ్చి చూడగా.. ఇంట్లో తల్లీకూతుళ్లు విగజీవులుగా పడి ఉన్నారు. ఈ సీన్ ను చూసిన శారద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం శారద కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.