రెండు తెలుగు రాష్ట్రాల్లో నవీన్ హత్య కేసు పెను సంచలనం సృష్టించింది. నిందితులను చూస్తే.. వామ్మో వీరు మనుషులా లేక మృగలా అనే అనుమానం రాక మానదు. ఇక కేసులో నిందితురాలైన యువతి సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు.
అబ్దుల్లాపూర్‌మెట్‌లో బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో హరిహరకృష్ణతో పాటు అతడి ప్రియురాలిని, స్నేహితుడు హసన్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. యువతిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ హత్య చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రియురాలి కోసమే హరి, నవీన్‌ను హత్య చేశానని అంగీకరించాడు. ఈ ఏడాది జనవరి 16ననే నవీన్‌ను హత్య చేయాలని భావించాడు హరి. కానీ కుదరకపోవడంతో.. ఫిబ్రవరి 17న నవీన్‌ను అత్యంత దారుణంగా హత్య చేసి.. శరీర భాగాలను సైతం వేరు చేశాడు. హత్య తర్వత హరి.. దీని గురించి తన స్నేహితుడు హసన్, ప్రియురాలికి తెలిపాడు. అంతేకాక హసన్ సాయంతో.. నవీన్ శరీర భాగాలను బ్రాహ్మణపల్లిలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు. ఆ తర్వాత యువతిని కలిసి, వరంగల్ వెళ్లాడు.
నవీన్ హత్య కేసులో ఏ3 ముద్దాయిగా ఉన్న నిహారిక.. పోలీసులు విచారణలో సంచలన విషయాలు వెల్లడించింది. తాను, నవీన్ ఇంటర్ నుంచే ప్రేమించుకున్నామని.. తమ ఇంట్లోనే ఇద్దరం కలుసుకునేవాళ్లమని చెప్పింది. నవీన్, తాను గొడవపడితే.. హరిహరకృష్ణ సర్ది చెప్పేవాడని.. ఇద్దరి మధ్య తనే మధ్యవర్తిగా ఉండేవాడని వెల్లడించింది. తాను, నవీన్ విడిపోయాక.. హరి తనను ప్రేమిస్తున్నానని చెప్పాడని వెల్లడించింది. అంతేకాక హరిహరకృష్ణ.. తరచుగా నవీన్‌ను చంపేసి.. తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్తానని అనేవాడని.. తాను మందలిస్తే.. ఊరికే సరదాగా అన్నానని చెప్పేవాడని యువతి పోలీసులకు తెలిపింది.
అంతేకాక హరి, నవీన్‌ను చంపడానికి వాడిన కత్తులు, రెండు గ్లౌజులు తనకు చూపించాడని యువతి వెల్లడించింది. నవీన్ హత్య తర్వాత తాను 4 సార్లు హరిని కలిశానని తెలిపింది. హత్య విషయం గురించి తనకు తెలిసినా కావాలనే పోలీసులకు, ఫ్రెండ్స్‌కు చెప్పలేదు అన్నది. ఈ కేసులో తాము దొరికే అవకాశమే లేదని హరి తనతో చెప్పాడని.. అతడి మాటలు నమ్మానని యువతి వెల్లడించింది. నవీన్ హత్య తర్వాత తాము వనస్థలిపురం ప్రాంతంలో 3 సార్లు కలిశానని ఒప్పుకుంది. హత్య తర్వాత హరికి 1500 రూపాయలు ఇచ్చి పారిపోయేందుకు సహకరించానని యువతి అంగీకరించింది. మరి తనతో పాటు మరో ముగ్గురి జీవితాలను నాశనం చేసిన యువతి తీరు సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.