విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలో మతం పేరుతో వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రార్థనల పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్నాడంటూ కోదాడకు చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ కృష్ణలంకకు చెందిన అనిల్ కుమార్ రైల్వేలో కారుణ్య నియామకం కింది టికెట్ కలెక్టర్ గా చేరాడు. ఐదేళ్ల క్రితమే పాయకరావుపేటకు నివాసం మార్చాడు. అక్కడ పేరు మార్చుకుని ప్రేమదాస్ పేరుతో చలామణి అవుతున్నాడు. ఓ విలాసవంతమైన భవంతి నిర్మించి దానిని ఆశ్రమంగా మార్చాడు. అక్కడ ప్రార్థనల పేరుతో యువతీ యువకులను లోబరుచుకుని వికృత చేష్టలకు పాల్పడేవాడు. అతని చేష్టలతో విసిగిపోయిన యువతి, కొందరు యువకులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ప్రేమదాస్ పై ఐపీసీ సెక్షన్ 376, 344, 354, 506, 493, 374, 312తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.
ఆశ్రమంగా చెబుతున్న ఆ భవనాన్ని నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోల్ కూడా పరిశీలించారు. అక్కడున్న యువతీ యువకుల స్టేట్ మెంట్లు రికార్డు చేశారు. వారిలో కొంతమంది వారు ఇష్టపూర్వకంగానే అక్కడ ఉంటున్నట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన యువతి తనకు ఇష్టం లేకుండా మరో యువకుడితో బలవంతంగా వివాహం చేసినట్లు, గర్భం దాలిస్తే అబార్షన్ చేయించినట్లు ఆరోపించింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పడకగది వీడియోలు ఫేస్ బుక్ లో పెట్టి..