జార్ఖండ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో, బుల్లెట్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. ప్రమాదానికి అతివేగం, నిర్లక్ష్యం ముఖ్య కాణాలుగా చెప్పవచ్చు. అతివేగంతో వాహనాలను నడుపుతూ పక్క వాహనాలను ఓవర్ టేక్ చేసే సమయంలో చాలా ప్రమాదాలు నెలకొంటున్నాయి. అతివేగంతో కూడా యువకులు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. పరిమితికి మించి వేగంతో వాహనాలను నడిపే వారికి ఫైన్ విధించినా ఫలితం లేకపోతోంది. మద్యం మత్తులో కూడా వాహనాలను నడిపి ఇతరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా జార్ఖండ్ హజారీబాగ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అసలు వివరాల్లోకి వెళితే..
జార్ఖండ్ హజారీబాగ్ జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. బొలెరో, బుల్లెట్ బైక్ పరస్పరం రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీనితో బొలెరో అదుపు తప్పి పక్కగా ఉన్న బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని హజారీబాగ్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హజారీ బాగ్.. పద్మ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోమి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో-బైక్ రెండు ఎదురెదురుగా ఢీకొని బొలెరో అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురు మృతి చెందినట్లు, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. మృతిచెందిన వారిలో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెస్క్యూటీమ్ ఘటనా స్థలానికి చేరుకుని, బావిలోకి దిగి మృతదేహాలను బయటకు తీసిందని పేర్కొన్నారు.