పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులకు మరో షాక్ తగిలింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా, వారి సంస్థపై మూడు లక్షల జరిమానా విధించింది. ఈ ఆర్డర్ అందిన 45 రోజులలోపు 3 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. సె ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణ రూల్స్ ను అతిక్రమించారనే కారణాలతో ఫైన్ విధించింది.
వియాన్ ఇండస్ట్రీస్ కు సంబంధించి 2013 సెప్టెంబర్ 1 నుంచి 2015 డిసెంబర్ 23 వరకు నిర్వహించిన ట్రేడింగ్/డీలింగ్ పై విచారణ జరిపామని సెబీ తెలిపింది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, వియాన్ ఇండస్ట్రీస్ లు సెబీ ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణ రెగ్యులేషన్స్ అతిక్రమించారనే విషయం విచారణలో తేలిందని ప్రకటించింది.
సెబీ ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణ నిబంధన ప్రకారం రూ. 10 లక్షలకు మించిన లావాదేవీలు జరిగితే రెండు ట్రేడింగ్ దినాల్లోనే వాటికి సంబంధించిన పూర్తి వివరాలను స్టాక్ ఎక్స్ఛేంజీలకు ప్రమోటర్లు అందజేయాల్సి ఉంటుందని చెప్పింది. అయితే వీరు ఆ పని చేయలేదని వ్యాఖ్యానించింది.
శెట్టి, కుంద్రాలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్దారని తెలిపింది. తాము విధించిన రూ. 3 లక్షల జరిమానాను వీరు 45 రోజుల్లోగా చెల్లించాలని సెబీ ఆదేశించింది. పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న రాజ్‌కుంద్రా బెయిల్ పిటీషన్‌ను కూడా కోర్టు రద్దు చేసింది.
పోర్న్ ఫిలిమ్స్ తయారీ, ఆన్‌లైన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గత ఏడాది ఆగస్టు, డిసెంబర్ మధ్యకాలంలో కుంద్రా రూ. 1.17 కోట్లు ఆర్జించినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 11మంది ని అరెస్ట్ చేసిన చేసిన సంగతి తెలిసిందే.