ప్రపంచమంతా ఆంగ్లమయం అయిపోయింది. ఏ దేశం వారితో కమ్యూనికేట్ అవ్వాలన్నా ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. అందుకే చాలా దేశాల్లో ఇంగ్లీషులోనే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఈ సమయంలో ఒక దేశ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మిగిలిన వివరాలు..
ఆంగ్లం.. ఈ భాషకు ఉన్న క్రేజ్ వేరు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న భాష ఇది. చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా అన్నింటా ఆంగ్లం తప్పనిసరిగా మారింది. అందుకే తల్లిదండ్రులు కూడా మాతృభాషలో కాకుండా ఆంగ్లంలో పిల్లల్ని చదివించడానికి ఇష్టపడుతున్నారు. ఇంగ్లీషుకు ప్రాధాన్యం పెరగడంతో చాలా దేశాలు ఆ భాషకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ తరుణంలో ఒక దేశం మాత్రం ఆంగ్లాన్ని వినియోగించడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేసింది. అందుకోసం ఒక ముసాయిదా బిల్లును కూడా తీసుకొచ్చింది. పొరపాటున మాటల్లో ఇంగ్లీషు పదాలు దొర్లినా పెద్ద మొత్తంలో ఫైన్ విధిస్తామని పేర్కొంది. ఆ దేశమే ఇటలీ.
ఇటలీ ప్రధాని, బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నేత జార్జియా మెలోని ఈ కొత్త ప్రతిపాదిత చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏ ఇటాలియన్ అయినా కమ్యూనికేట్ చేసేటప్పుడు.. విదేశీ పదాలను వినియోగిస్తే సుమారు రూ.82 లక్షల వరకు ఫైన్ విధిస్తారు. ఈ బిల్లును ఛాంబర్ ఆఫ్ డిప్యూటీ సభ్యుడు ఫాబియో రాంపెల్లి ప్రవేశపెట్టారు. దీనికి ప్రధాని జార్జియా మద్దతు తెలిపారు. ఇంగ్లీష్ పదాలు లేదా ఆంగోమానియాను టార్గెట్గా చేసుకుని ఈ చట్టాన్ని తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం.. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇటాలియన్ భాషను కించపరుస్తున్నట్లు పేర్కొంది. బ్రిటన్ నిష్క్రమణతో బ్రెగ్జిట్గా పేరుగాంచిన యూరోపియన్ యూనియన్ కారణంగా ఈ పరిస్థితి మరింతగా దిగజారిందని ఆ బిల్లు తెలిపింది.
ఇటలీ ప్రవేశపెడుతున్న నూతన చట్టం ప్రకారం.. ప్రభుత్వ అధికారులు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పదవిని గల వారు ఎవరైనా రాతపూర్వకంగా, కమ్యూనికేషన్ పరంగా ఇటాలియన్ భాషపై నైపుణ్యం కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఉద్యోగ, వ్యాపార సంబంధిత ధ్రువపత్రాలు, అధికారిక డాక్యుమెంట్లలోనూ ఆంగ్లంలోని పేర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఆఖరుకు ఇటాలియన్ భాష తెలియని విదేశీయులతో కమ్యూనికేట్ చేసే కార్యాలయాలకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని చెప్పింది. అయితే ఈ బిల్లు మీద పార్లమెంటులో చర్చలు జరిపిన తర్వాత పూర్తిస్థాయిలో అమలు చేయనుంది ఇటలీ సర్కారు. మరి.. ఇంగ్లీషు వద్దు మాతృభాషే ముద్దు అంటూ ఇటలీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Italy Seeks to Ban Use Of English In Official Communication https://t.co/9grWn0ba4n pic.twitter.com/acT5h5B00p
— NDTV News feed (@ndtvfeed) April 3, 2023