కొన్ని సార్లు చిన్న చిన్న పొరపాట్లకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుందామనుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. నిర్లక్ష్యం నిలువునా ముంచేస్తుంది. బాధితుల్ని చేసి ఆడుకుంటుంది.
కొన్ని సార్లు చిన్న చిన్న పొరపాట్లకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుందామనుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. నిర్లక్ష్యం నిలువునా ముంచేస్తుంది. బాధితుల్ని చేసి ఆడుకుంటుంది. డబ్బు పోయి శని పట్టిన చందానా జీవితం మారిపోతుంది. సమయం కూడా వృధా కావచ్చు. మన అనునకున్న వాళ్లు దూరం అవ్వొచ్చు. భయపెట్టడానికో, హెచ్చరించడానికో ఇవన్నీ చెప్పడం లేదు. అనేక మంది జీవితాల్లో ఇటువంటి సందర్భాలను ఎదుర్కొని ఉంటారు కూడా. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయే అబ్దుల్ ఖాదీర్ అనే వ్యక్తిదీ ఇదే పరిస్థితి. చిన్నదంటే చిన్న తప్పు కారణంగా ఆరు వేల రూపాయలు వృథా అయ్యాయి.
టాయిలెట్ కోసం ఫ్లాట్ ఫామ్‌పై ఆగిన వందే భారత్ రైలు ఎక్కి.. రూ. 6 వేలు నష్టపోయాడు. అదెలా అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌కు చెందిన అబ్దుల్ ఖాదీర్ హైదరాబాద్, సింగ్రౌలీలో డ్రైఫ్రూట్స్ దుకాణాలు నడుపుతున్నాడు. ఈనెల హైదరాబాద్ నుండి తన భార్య, కొడుకుతో స్వగ్రామం సింగ్రౌలీకి బయలు దేరారు. ముందు హైదరాబాద్ నుండి రైలులో భోపాల్ చేరుకున్నారు. సింగ్రౌలీకి వెళ్లే రైలు రాత్రి బయలు దేరాల్సి ఉంది. దీని కోసం ఫ్లాట్ ఫామ్ పై వేచి చూస్తున్నారు అతడి కుటుంబం. అయితే అంతలో అతడికి బాత్రూమ్ రావడంతో.. ఫ్లాట్ ఫామ్ మీదకు వచ్చిన ఇండోర్ వెళ్లే వందే భారత్ రైలు ఎక్కాడు. టాయిలెట్ నుండి బయటకు వచ్చి రైలు దిగిందేకు ప్రయత్నించే లోపు తలుపులు మూత పడ్డాయి. అప్పటికే రైలు ఫ్లాట్ ఫామ్‌ను వీడింది.
దీంతో కంగారు పడ్డ అతడు.. కోచ్‌లలో ఉన్న ముగ్గురు టిక్కెట్ కలెక్టర్లు, నలుగురు పోలీసు సిబ్బంది నుంచి సహాయం కోరేందుకు ప్రయత్నించాడు. రైలు ఉజ్జయినీలో ఆగుతుందని టీటీ చెప్పడంతో.. అందులో ఉండిపోయాడు. టికెట్ లేకుండా ప్రయాణించినందుకు రూ. 1020 జరిమానా కట్టాల్సి వచ్చింది. ఉజ్జయినీలో రైలు దిగిన తర్వాత.. భోపాల్‌కు బస్సులో బయలు దేరాడు. దాని కోసం రూ. 750 ఖర్చు పెట్టాడు. అంతేకాదు సింగ్రౌలీకి వెళ్లే రైలు కోసం టికెట్లకు ఖర్చు రూ. 4వేలు అయ్యింది. అతడు మిస్ అయిన దగ్గర నుండి కుటుంబం రైల్వే స్టేషన్‌లో ఉండిపోయింది. వారు ప్రయాణం కోసం బుక్ చేసుకున్న రైలు ఎక్కకపోవడంతో ఆ టికెట్లు కూడా వృథా అయ్యాయి. వందే భారత్ రైలులో టాయిలెట్‌కు వెళ్లినందుకు డబ్బులు వృథాతో పాటు సమయం కూడా మూల్యంగా చెల్లించుకోవాల్సి వచ్చింది.