తిరుమల దేవస్థానానికి, శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఉన్నారు. దేశ విదేశాల నుంచి ఆయనకు విరాళాలు, కానుకలు అందుతూనే ఉంటాయి. అయితే చాలా మంది విరాళం ఇచ్చే సమయంలో వారి వివరాలను తెలయజేయరు. అయితే అలా వివరాలు లేకుండా వచ్చిన విరాళాల వల్ల ఇప్పుడు టీటీడీకి కేంద్రం జరిమానా విధించింది.
తిరుమల శ్రీవారికి భారతదేశం, తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో భక్తులు ఉన్నారు. రోజూ లక్షల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే భక్తులు విరాళాలు, కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ కానుకలకు సంబంధించి టీటీడీకి కేంద్రం షాకిచ్చింది. రూ.4.31 కోట్లు జరిమానాగా కట్టాలంటూ నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి లభించే హుండీ కానుకల విషయంలో భక్తుల వివరాలు లేవంటూ కేంద్రం ఈ జరిమానాను విధించింది. 2019కి కోటి రూపాయలు ఫైన్ విధించగా.. మళ్లీ రూ.3 కోట్లు కట్టాలంటూ నోటీసులిచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు.
టీటీడీకి కేంద్రం రూ.4.31 కోట్లు జరిమానా విధించింది. ఎందుకు ఇలా జరిమానా విధించింది అనే విషయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. హుండీలో కానులు వేసిన వారి వివరాలు.. కేంద్ర ఎఫ్ సీఆర్ఏ విభాగం వార్షిక రిటర్నుల్లో లేవని ఈ జరిమానాను విధించారు. 2019లో రూ.1.01 కోట్లు జరిమానా విధించారు. ఇప్పుడు మళ్లీ రూ.3.19 కోట్లు జరిమానా కట్టాలంటూ చెప్పారు. తిరుమల శ్రీవారికి విదేశాల నుంచి కూడా భక్తులు ఆన్ లైన్ లో విరాళాలు సమర్పిస్తుంటారు. కొంతమంది వారి వివరాలును అందులో పొందుపరచరు. అలా పొందు పరచకుండా ఇచ్చిన విరాళాలకు సంబంధించి మొత్తం రూ.26 కోట్లను స్టేట్ బ్యాంక్ టీటీడీ ఖాతాలో జమ చేయకుండా మూడేళ్లుగా హోల్డ్ చేసింది.
ఈ సమస్యను పరిష్కరించాలంటూ టీటీడీ కేంద్రానికి లేఖ రాసింది. అయితే ఈ సమస్య విషయంలో కేంద్రం తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే రివర్స్ లో టీటీడీకే కేంద్రం జరిమానా విధించింది. వివరాలు లేకుండా ఉన్న విరాళాలకు సంబంధించి దాదాపు 10 శాతం వరకు జరిమానా విధించింది. ఈ విషయంలో కేంద్రం తీరును జైరాం రమేశ్ దుయ్యబట్టారు. ఒక థార్మిక సంస్థ విషయంలో ఇలా ప్రవర్తిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఆయన లేవనెత్తిన ఈ వివాదానికి నెటిజన్స్ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. టీటీడీ విషయంలో కేంద్రం ఇలా జరిమానా విధించడంపై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
सबसे पवित्र तिरुमाला तिरुपति देवस्थानम (TTD) जहां हर दिन लाखों भारतीय तीर्थयात्री जाते हैं, उसे मोदी सरकार नोटिस भेजती है और 3 करोड़ रुपए का जुर्माना लगाती है, जबकि अडानी को बचा लिया जाता है।
मोदानी है तो मुमकिन है! https://t.co/d16Y0RXOpo
— Jairam Ramesh (@Jairam_Ramesh) March 27, 2023