ఆధార్ కార్డు గురించి మీకు తెలిసుండొచ్చు. కానీ ఉద్యోగ్ ఆధార్ అనేది ఇంకోటి ఉందని మీలో ఎంత మందికి తెలుసు? చాలా మందికి దీని గురుంచి తెలియదు. ఉద్యోగ్ ఆధార్ అంటే ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ గురుంచి అందరికీ విదితమే. 12 అంకెలున్న ఆధార్ కార్డు దేశంలో అత్యంత విశిష్టమైన గుర్తింపు కార్డుగా ఉంది. ప్రభుత్వ పథకాలతో పాటు ఎలాంటి సేవలు పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అయిన రోజులివి. మరి ఉద్యోగ్ ఆధార్ అంటే ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అన్నది తెలుసా..? తెలియదు. అందుకే ఈ సమాచారాన్ని మీకు తెలియయజేస్తున్నాం. ఉద్యోగ్ ఆధార్ అనేది వ్యక్తులకు జారీ చేయరు. దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు జారీ చేస్తారు.
12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండే దీనిని భారత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. దీనిని బిజినెస్ ఆధార్ అనికూడా పిలుస్తారు. 2015, సెప్టెంబర్‌లో దీన్ని ప్రారంభించారు. చిరు వ్యాపారులకు సులభంగా రుణాలు అందించేందుకు.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అదనపు ప్రయోజనాలు చేకూర్చేందుకు దీన్ని తీసుకొచ్చారు. గతంలో ఏదేని బిజినెస్ ప్రారంభించాలంటే ISI రిజిస్ట్రేషన్ లేదా MSME రిజిస్ట్రేషన్ పొందాలంటే చాలా సమయం పట్టేది. ఎన్నో డాక్యుమెంట్లు అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు కేవలం 2 ఫామ్స్(ఎంట్రప్రెన్యూర్ మెమోరాండమ్-1, ఎంట్రప్రెన్యూర్ మెమోరాండ్మ్-2) నింపితే చాలు. పని అయిపోతోంది.
ఉద్యోగ్ ఆధార్ నమోదు ప్రక్రియ ఉచితం. దీనని కోసం udyogaadhaar.gov.inలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నమోదు చేసుకున్న చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు.. సబ్సిడీలు, రుణ ఆమోదాలు మొదలైన ప్రభుత్వ పథకాల ద్వారా ప్రవేశపెట్టిన అనేక ప్రయోజనాలను పొందుతాయి. కావున చిన్న చిన్న పరిశ్రమలు పెట్టిన వారు ‘ఉద్యోగ్ ఆధార్’ తీసుకోవడం ఉత్తమం.