దేశంలో డిజిటల్ చెల్లింపుల వేగం పుంజుకుంటోంది. ఎక్కడ చూసినా.. గూగుల్ పే, ఫోన్ పే అంటూ డిజిటల్ వ్యాలెట్ల క్యూఆర్ కోడ్ లు దర్శనమిస్తున్నాయి. చిరువ్యాపారులు మొదలుకొని పెద్ద షాపింగ్ మాళ్లు, సూపర్ స్టోర్ వరకు.. అన్నింటా క్యూఆర్ స్కానింగ్ లు అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ సదుపాయంతో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ చెల్లింపుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో నగదు చెలామణి తగ్గిపోయింది. అయితే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజలు తిరిగి డబ్బును చెలామణీలోకి తిరిగి తీసుకొచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నట్లు కనిపిస్తోంది.
నివేదికల ప్రకారం.. UPI యాప్‌లు త్వరలోనే వినియోదారుల లావాదేవీలపై పరిమితిని విధించవచ్చని సమాచారం. ఇప్పటికే ప్రైవేటు రంగంలోని బ్యాంకింగ్ దిగ్గజం HDFC రోజువారీ యూపీఐ లావాదేవీల పరిమితిని 10కి తగ్గించింది. యూపీఐ చెల్లింపుల మార్కెట్లో దాదాపు 95 శాతం వాటా కలిగి ఉన్న గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం కంపెనీలు సైతం అదే బాటలో నడవచ్చని సమాచారం. దీనంతటికి కారణం.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) చర్యలే. ఎన్పిసీఐ.. డిజిటల్ చెల్లింపుల కంపెనీల లావాదేవీల పరిమితిని తగ్గించడానికి డిసెంబర్ 31 డెడ్ లైన్ గా పెట్టుకుందట. ఇది అమలులోకి వస్తే ఆయా కంపెనీల వాల్యూమ్ 30 శాతానికి పరిమితం అవుతుంది. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంక్, ఎన్పిసీఐ డిజిటల్ పేమెంట్ల యాపులతో సంప్రదింపులు జరుపుతున్నాయట.
National Payments Corporation of India (NPCI), which runs the UPI digital pipeline, is in talks with the Reserve Bank on implementation of its proposed December 31 deadline for limiting the volume cap of players to 30 per cent.https://t.co/PUWT5SlMuZ
— Economic Times (@EconomicTimes) November 21, 2022