దేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వేగంగా దూసుకుపోతోంది. ప్రతీ ఏడాది కోట్లాది కొత్త మొబైళ్లు అమ్ముడవుతున్నాయి. స్మార్ట్ ఫోన్స్ మీద ఇండియన్స్ కి ఉన్న క్రేజ్ ని ఆసరాగా చేసుకొని.. సామ్‌సంగ్, రియల్‌మీ, షియోమీ, వన్‌ప్లస్ సహా అన్ని మొబైల్ తయారీ సంస్థలు భారత్‌నే లక్ష్యంగా చేసుకొని ఫోన్లను తీసుకొస్తుంటాయి. పోటీపడి మరీ కోపతా మోడల్స్ ని లాంచ్ చేస్తుంటాయి. ఈ క్రమంలో గత సంవత్సరం (2021) లో రికార్డు స్థాయి అమ్మకాలు జరిగాయి. అందుకు సంబంధించిన గణాంకాలను కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. గత ఏడాదిలో ఏకంగా దేశంలో 16.9 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడయ్యాయని ప్రకటించింది. 2020లో ఈ సంఖ్య 15.2 కోట్లు ఉండగా.. 2021లో 11 శాతం పెరిగింది.గత సంవత్సరం కరోనా.. కొత్త రకంతో విజృంభించినా భారతీయులు మాత్రం స్మార్ట్‌ఫోన్లను తెగకొనేశారు. ప్రపంచ వ్యాప్తంగా రవాణా ఆంక్షలు, చిప్‌లు సహా మొబైల్ తయారీ పరికరాల కొరత వంటి ఆటంకాలు ఏర్పడినా మొబైళ్ల అమ్మకం ఏ మాత్రం తగ్గలేదని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది.
మిడ్ రేంజ్ ఫోన్ల అమ్మకాలే ఎక్కువ
2021లో రూ.10,000 నుంచి రూ.20,000 మధ్య ధర ఉన్న స్మార్ట్‌ఫోన్లే అధికంగా అమ్ముడయ్యాయి. మొత్తం సేల్స్‌లో వీటి వాటా 47 శాతంగా ఉంది. 2020 తో పోలిస్తే గత ఏడాది 8 శాతం వృద్ధి కనబడింది. ఇక రూ.10,000 లోపు ధర ఉన్న స్మార్ట్‌ఫోన్లు 30 శాతం మార్కెట్‌ను దక్కించుకున్నాయి. 2020 సంవత్సరంతో పోలిస్తే వీటి వాటా 5 శాతం తగ్గుదల కనిపించింది. ఇక రూ.20,000 నుంచి రూ.30,000 మధ్య ధర ఉన్న స్మార్ట్‌ఫోన్లు 13 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఈ రేంజ్ మార్కెట్ 2020 తో పోలిస్తే 95 శాతం పెరుగుదల కనిపించింది. రూ.30,000 ఆపై ధర ఉన్న మొబైళ్ల అమ్మకాల్లో 2020 తో పోలిస్తే 98 శాతం వృద్ధి కనపడింది.5జీ క్రేజ్ కూడా స్మార్ట్ ఫోన్స్ సేల్స్ ప్యారగడానికి ఒక కారణంగా తెలుస్తోంది. మొత్తం స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో 5జీ కనెక్టివిటీ ఉన్న ఫోన్లు 7 శాతం ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఆరు రెట్లు 5జీ మొబైల్స్ అధికంగా అమ్ముడయ్యాయి. తీవ్రమైన పోటీ, 5జీ ప్రాసెసర్ల ధరలు తక్కువగా దొరకడంతో దాదాపు మొబైల్ కంపెనీలన్నీ బడ్జెట్ రేంజ్‌లో 5జీ ఫోన్లను తీసుకొస్తున్నాయి. కంపెనీల మధ్య పోటీ ఎక్కువగా ఉండడం వల్ల కంపెనీలు సాధ్యమైనంత వరకు తక్కువ ధరలో అందుబాటులో ఉంచుతున్నాయి. దీని కారణంగానే వీటి అమ్మకం పెరిగినట్లు తెలుసోది.
రాబోయే కాలంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రెండంకెల వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మిడ్ రేంజ్, హైరేంజ్‌లో 5జీ ఫోన్ల అమ్మకాలు పెరుగుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. దేశంలో ప్రస్తుత ఉన్న మొబైల్ తయారీ సంస్థలతో పాటు కొత్తగా పెట్టుబడులు పెట్టబోయే కంపెనీలు కూడా వృద్ధి చెందేందుకు భారత్‌లో అవకాశాలు మెండుగా ఉన్నాయని కౌంటర్‌పాయింట్ నివేదికలో పేర్కొంది.
Congratulations to the winners of the Best Premium Smartphones of 2021 at the #DigitZero1Awards@Apple @Vivo_India @OnePlus_IN pic.twitter.com/7fVZM4uMbx
— Digit (@digitindia) December 17, 2021
2021 was Apple’s best year in India so far.
The company sold close to 6 million iPhones last year and they don’t like slowing down any time soon.
Now some would say that’s a drop in the ocean considering India bought a whopping 170 million smartphones during the same period.
— India Digital (@IndiaDigital_) February 11, 2022