దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహితలకు మరోసారి షాకిచ్చింది. ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేట్లను క్రమంగా పెంచుతున్న ఎస్బీఐ..మరోసారి వఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. సవరించిన వద్దే రేట్లు ఈ నెల 15 నుంచి అమలులోకి రానున్నాయి.
బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం మేరకు ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్‌ఆర్ 7.40 శాతం నుంచి 7.50 శాతానికి సవరించింది. దీంతోపాటు ఒక్కరోజు, మూడు, ఆరు నెలల రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ని కూడా పెంచింది. రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను పెంచిన నాటినుంచి ఎస్బీఐ ఎంసీఎల్‌ఆర్‌ని క్రమంగాపెంచుతోంది. గత నెలలోనూ ఎంసీఎల్‌ఆర్‌ని ఎస్బీఐ 20 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే.
సవరించిన ఎంసీఎల్‌ఆర్ ఇంట్రస్ట్ రేట్లు
#BTGraphics | The #StateBankofIndia (#SBI) has increased marginal cost of lending rate (MCLR) on loans by 10 bps, effective from Friday. The rates for all tenors increased by 10 bps.
Read More: https://t.co/73xVj82uJi pic.twitter.com/1foxpNUokd
— Business Today (@business_today) July 15, 2022
శుక్రవారం(జులై 15) నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఎంసీఎల్‌ఆర్ వడ్డీ రేట్లు సామాన్యుడి తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా హోం లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్‌పై చెల్లించే ఈఎంఐలు మరింత భారం కానున్నాయి.
ఎంసీఎల్‌ఆర్ అంటే ఏంటి?
ఎంసీఎల్‌ఆర్‌ను ‘మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్’ అని చెప్పొచ్చు. ఈ ఎంసీఎల్‌ఆర్‌ను వాడుక భాషలో సింపుల్‌గా చెప్పుకోవాలంటే.. వివిధ బ్యాంకుల్లో ఏదైనా లోన్ తీసుకోవాలంటే.. ఆ లోన్‌లపై మినిమం ఇంత మొత్తంలో వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఆ వడ్డీ అనేది ఎంసీఎల్‌ఆర్ ను బేస్ చేసుకొని నిర్ణయిస్తాయి. లోన్‌లతో పాటు, టెన్యూర్‌ను బట్టి లోన్లపై బ్యాంకులు వడ్డీని విధిస్తాయి. ఈ విధానాన్ని ఆర్బీఐ 2016లో అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి బ్యాంకుల్లో ఎంసీఎల్‌ఆర్‌ను ఆధారంగా హోం లోన్, పర్సనల్ కార్ లోన్లపై ఇంట్రస్ట్ రేట్లు తగ్గు తుంటాయి.పెరుగుతుంటాయి.
ఇది కూడా చదవండి: KYC updation: KYC పేరుతో కస్టమర్లకు షాకిచ్చిన SBI.. అకౌంట్లు ఫ్రీజ్!