సినిమా థియేటర్స్ లో కంటే ఇప్పుడు అందరూ ఓటీటీల బాటపట్టారు. థియేటర్ లో రిలీజైన నెలా, రెండు నెలలకే సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లకు డిమాండ్ పెరిగిపోయింది. అమెజాన్ ప్రైమ్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నెలకు రూ. 179, నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ బేసిక్ ధర నెలకు రూ. 199, ఇక డిస్నీ+హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ పొందాలంటే నెలకు రూ. 300/- అవుతుంది. మొత్తంగా 700 దాకా అవుతుంది. అయితే ఇంటర్నెట్ అనేది రాదు. మొబైల్ లో ఎక్కువ సినిమాలు చూడాలంటే మొబైల్ రీఛార్జ్ తో వచ్చే డైలీ డేటా సరిపోదు. అదే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ వస్తుంది. అలానే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీ సేవలు నెల నెలా ఉచితంగా పొందవచ్చు.
ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఫైబర్ అనేది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇందులో 5 రకాల రీఛార్జ్ ప్లాన్ లు ఉన్నాయి. బేసిక్ రీఛార్జ్ ప్లాన్ రూ. 499 ఉంది. ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ పై ఓటీటీ సేవలు కూడా పొందవచ్చు. రూ. 499 ప్లాన్ తో అపరిమిత డేటా పొందవచ్చు. 40 ఎంబీపీఎస్ స్పీడ్ వస్తుంది. 3.3 టీబీ వరకూ డేటా స్పీడ్ ఫాస్ట్ గా ఉంటుంది. ఆ తర్వాత స్పీడ్ తగ్గుతుంది. అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తో ఎక్స్ట్రీమ్ ప్రీమియం, అపోలో 24/7, ఫాస్టాగ్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. రూ. 799 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్ వస్తుంది. అన్ లిమిటెడ్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్స్ట్రీమ్ ప్రీమియం, అపోలో 24/7, ఫాస్టాగ్, వింక్ మ్యూజిక్ ప్రయోజనాలు వస్తాయి.
రూ. 999 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాల్స్, 200 ఎంబీపీఎస్ స్పీడ్ పొందవచ్చు. డిస్నీ+హాట్ స్థార్, అమెజాన్ ప్రైమ్, ఎక్స్ట్రీమ్ ప్రీమియం, వీఐపీ సర్వీస్, అపోలో, ఫాస్టాగ్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు పొందవచ్చు. రూ. 1498 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత డేటా, 300 ఎంబీబీఎస్ స్పీడ్, అపరిమిత కాల్స్ ప్రయోజనాలు వస్తాయి. నెట్ ఫ్లిక్స్ బేసిక్, డిస్నీ+హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, ఎక్స్ట్రీమ్ ప్రీమియం, వీఐపీ సర్వీస్, అపోలో, ఫాస్టాగ్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
ఆఖరి ప్లాన్ రూ. 3,999 ప్లాన్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాల్స్ పొందవచ్చు. 1 జీబీపీఎస్ స్పీడ్ ఉంటుంది. ఈ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ ప్రీమియం, డిస్నీ+హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, ఎక్స్ట్రీమ్ ప్రీమియం, వీఐపీ సర్వీస్, అపోలో, ఫాస్టాగ్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ తో ప్రతి నెలా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+హాట్ స్టార్ సహా పలు ఓటీటీ సేవలు పొందడమే కాకుండా.. అపరిమిత ఇంటర్నెట్ డేటా పొందవచ్చు. ఎక్స్ట్రీమ్ ప్రీమియం కంటెంట్ తో 15 ఓటీటీలకు సంబంధించిన కంటెంట్ చూడవచ్చు.