ఖాతాదారులారా..! మీకో ముఖ్య అలెర్ట్. సెలవుల కారణంగా మే నెలలో 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆ తేదీలు ఎప్పుడన్నది అన్నది ముందుగా తెలుసుకొని అందుకు తగ్గట్టుగా ప్లాన్ మనవి.
ఖాతాదారులారా..! మీకో ముఖ్య గమనిక. సెలవుల కారణంగా మే నెలలో 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు పనులున్నవారు ఆ తేదీలు ఎప్పుడన్నది తప్పక తెలుసుకోవాలి. లేనియెడల సెలవు రోజున బ్యాంకులకు వెళితే ఫలితం ఉండదు. శ్రమ, సమయం వృథా అవుతాయి. అలాగే మీరు అనుకున్న పని కూడా ఆటంకం ఏర్పడవచ్చు. అందువల్ల ముందుగానే సెలవుల సమాచారాన్ని పూర్తిగా తెలుసుకొని అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోండి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. 2023 మే నెలలో బ్యాంకులు దేశవ్యాప్తంగా 12 రోజులు మూతపడనుండగా, తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ) ఏడు రోజులు మూతపడనున్నాయి. ఇందులో వారాంతపు సెలవులు కూడా కలిపి ఉన్నాయి. ఏప్రిల్ నెలలో.. కార్మిక దినోత్సవం, బుద్ధపూర్ణిమ, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, మహారాణా ప్రతాప్ జయంతి వంటి పర్వదినాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో మే1న కార్మిక దినోత్సవంతో పాటు నాలుగు ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు బ్యాంకులు మూతపడనున్నాయి.
గమనిక: సెలవుల జాబితా అనేది ఆయా రాష్ట్రాల వారిగా వేరు వేరుగా ఉంటుంది. బ్యాంకుల సెలవు దినాల్లో మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి ఆన్‌లైన్ సౌకర్యాల ద్వారా ఖాతాదారులు తమ పనులు పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఏటీఎంలు తెరిచే ఉంటాయి కనుక నగదు విత్‍డ్రా చేసుకోవాలనుకునేవారు వాటి ద్వారా చేసుకోవచ్చు.