జీవితంలో ఎప్పుడు ఎవరు ఏ స్థితిలో ఉంటారో చెప్పలేము. దేనికి పనికి రాడు అనుకునే వ్యక్తి కాలం కలిసి వస్తే కుబేరుడు అవుతాడు. అలాంటి ఘటనలు మనం అనేకం చూశాం. తాజాగా ఓ వ్యక్తికి చదువు అబ్బలేదు.. ఉద్యోగం కలిసిరాలేదు. సంపాదన శూన్యం. కట్ చేస్తే మల్టీ మిలీనియర్ అయ్యాడు. ఏ లాటరీ తగల్లేవు. ఒకప్పుడు జేబులో పైసా లేని పరిస్థితి. కానీ ఇప్పుడు వందల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి.మరి.. ఆవ్యక్తి ఎవరు ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
34ఏళ్ల ఆడయ్ ప్రిస్బీ అనే వ్యక్తి చదువులో అంతంత మాత్రంగానే ఉండేవాడు. అతను జీవితంలో ఎలా స్థిర పడతాడా అని తల్లిండ్రులు టెన్షన్ పడేవారు. ఎక్కడైనా జాబ్ చూపిస్తేనైనా నిలకడగా ఉంటాడా అంటే అదీ లేదు. అలా ఎన్నో ఉద్యోగాలు వదిలేశాడు. ఆఖరికి అన్నతో కలిసి బర్గర్ కింగ్‌లో పని చేశాడు. అప్పుడే.. ఓ ఘటన అతని జీవితాన్ని మార్చేసింది. యాక్సిడెంట్లో ఆడమ్ అన్నకు చూపు పోయింది. అంతే.. ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆరు నెలల పాటు అన్నను కంటికి రెప్పలా చూసుకున్నాడు. అప్పటి నుంచే ఆడమ్‌కు ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి.
అప్పుడే ఆడమ్‌కు ఓ ఐడియా వచ్చింది. జాబ్ చేస్తే.. ఎంతో కొంత సంపాదించొచ్చు.. కానీ వాటితో కష్టాలు తీరవు. అదే బిజినెస్ చేస్తే.. కావాల్సినంత డబ్బు సొంతం అవుతుంది అనుకున్నాడు. అనుకున్నట్లుగానే.. కొన్ని ఐడియాలను పేపర్‌పై పెట్టాడు. అందులోంచి బట్టల వ్యాపారాన్ని ఎన్నుకున్నాడు. తనకంటూ ఓ బ్రాండ్ సృష్టించాడు
వెంటనే 2013లో లక్ష రూపాయలు పెట్టి.. ఇన్ ది స్టైల్ అనే సొంత బ్రాండ్‌తో వస్త్రాలు అమ్మడం మొదలు పెట్టాడు. ఎందుకంటే మహిళల బట్టలకు డిమాండ్ ఎక్కువ.. సప్లయ్ తక్కువ. అందుకే ఈ రూట్‌ని ఎన్నుకున్నాడు. హోల్‌సేల్‌లో తక్కువ రేట్లకు బట్టలు కొని.. వాటిని సొంతంగా డిజైన్ చేశాడు. వాటిని మూడు రెట్లు ఎక్కువకు అమ్మేశాడు. ఇంకేంటి కథ మారింది.
కొత్త కొత్త స్టైల్స్‌తో జనాన్ని ఆకట్టుకున్నాడు ఆడమ్. వేల నుంచి లక్షలు, లక్షల నుంచి కోట్లకు అతని సంపాదన పెరిగింది. ఇప్పుడు ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ల సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. ఇప్పుడు వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇది మామూలు విషయం కాదు. ఏదేమైనా.. ఆడమ్ జీవితం ఎంతో మందికి ఆదర్శం. మరి.. ఈ వ్యక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.