ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంతమంది జనాలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. వాహనాలను అడ్డగోలుగా నడుపుతున్నారు. నిర్లక్ష్యం, అతి వేగం.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినం చేస్తున్నా.. ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యాక్సిడెంట్ అనంతరం కింద పడిన వ్యక్తి చేసిన ఫీట్స్ చూస్తుంటే.. మైండ్ బ్లాక్ అవడం ఖాయం.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి బైక్ పై అతి వేగంగా వస్తున్నాడు.. అంతలోనే ఓ కారు వచ్చి బలంగా ఢీ కొట్టింది. దాంతో బైక్ పై ఉన్న వ్యక్తి ఎగిరి పడ్డాడు. అయితే ఆ యువకుడు తలకు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి గాయం కాలేదు. కారు ఢీ కొన్ని వేగానికి బైక్ ముక్కలై దూరంగా పడిపోయింది. ఇలాంటి ప్రమాదం జరిగితే మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.. లేదా గాయాలతో విల విలలాడిపోతారు. కానీ ఆ యువకుడు మాత్రం వింతగా రక రకాల విన్యాసాలు చేస్తూ అందరికీ షాక్ ఇచ్చాడు. ఓ వ్యక్తి వచ్చి ఆ బైక్ అక్కడ నుంచి పక్కకు తీసుకు వెళ్లాడు.
ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘mas_Adem’అనే ఓ నెటిజన్ ఈ వీడియో షేర్ చేశాడు. కేవలం 31 సెకన్లు ఉన్న ఈ వీడియోకు ఇప్పటి వరకు 2 మిలియన్లు రాబట్టింది. 60 వేల లైకులు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు మనోడికి మైండ్ దొబ్బింది అని.. మతి బ్రమించి సమురాయ్ గా మారాడని.. ఇలా రక రకాల కామెంట్స్ పెడుతున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Pendekar og pic.twitter.com/uyIpYPLK8T
— Mas Adem (@ndagels) June 23, 2022