భద్రత, సదుపాయాలతో కూడిన లగ్జరీ ఫ్లాట్ కొనాలని మీరు అనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లోని ఈ ఏరియాలో రూ. 30 లక్షలకే విశాలమైన 2 బీహెచ్కే ఫ్లాట్ దొరుకుతుంది. హైటెక్ సిటీ, మాదాపూర్ ఏరియాలకు దగ్గరగా ఉన్న ఏరియాలో తక్కువ బడ్జెట్ లో ఫ్లాట్స్ ఉన్నాయి.
సొసైటీల్లో అనేక రకాల సదుపాయాలు ఉంటాయి. స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, క్లబ్ హౌస్, అన్నిటికంటే ముఖ్యంగా సెక్యూరిటీ ఉంటాయి. ఒక ప్రత్యేక ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి, పోచారం, కేపీహెచ్బీ, నల్లగండ్ల, కోకాపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి ఇలా పలు ఏరియాల్లో ప్రముఖ సొసైటీలు చాలానే ఉన్నాయి. వీటిలో ఒక్కో సొసైటీలో ఒక్కో ఏరియాని బట్టి ధరలు ఉన్నాయి. ప్రైస్ అప్రిసియేషన్, అత్యధిక రేటింగ్, ఎక్కువ మంది వెతుకుతున్న సొసైటీలు ఇలా ఏరియాలు వారీగా ఉన్నాయి. మరి తక్కువ బడ్జెట్ లో లగ్జరీ ఫ్లాట్ ఏ ఏరియాలో దొరుకుతుంది?
కొన్న వెంటనే ఆలస్యం చేయకుండా ఫ్లాట్ లోకి వెళ్లిపోయేలా రెడీ టూ మూవ్ హోసింగ్ సొసైటీలు ఉన్నాయి. వాటిలో మల్లంపేటలో ఉన్న ఓ హౌసింగ్ సొసైటీలో 2 బీహెచ్కే అపార్ట్మెంట్స్, 2 బీహెచ్కే విల్లాలు ఉన్నాయి. మల్లంపేట హైదరాబాద్ కి 30 కి.మీ. లోపే ఉంది. హైటెక్ సిటీ, మాదాపూర్ ఏరియాలకు 20 కి.మీ. లోపు దూరంలో ఈ హోసింగ్ సొసైటీలు ఉన్నాయి. 2 బీహెచ్కే అపార్ట్మెంట్ సైజ్ వచ్చేసి 975 చదరపు అడుగులు ఉంటుంది. ధర రూ. 30 లక్షలు ఉంటుంది. ఇక 2 బీహెచ్కే విల్లా ఐతే 1700 చదరపు అడుగులు ఉంటుంది. ధర వచ్చేసి 1.6 కోట్లు ఉంటుంది. హైదరాబాద్ లో ఏ సొసైటీలో లేనంత తక్కువ ధర ఈ మల్లంపేటలో ఉన్న సొసైటీల్లో ఉన్నాయి. యావరేజ్ గా చదరపు అడుగు రూ. 2,850 ఉంది. 2 బీహెచ్కే ఫ్లాట్ కావాలంటే రూ. 28 లక్షలు అవుతోంది.
రియల్ ఎస్టేట్ నిపుణులు రికమండ్ చేస్తున్న హౌసింగ్ సొసైటీలు గచ్చిబౌలి, కౌకూర్, కొండాపూర్, కోకాపేట్, నల్లగండ్ల ఏరియాలు టాప్ 5లో ఉన్నాయి. కౌకూర్ లో ఉన్న హౌసింగ్ సొసైటీల్లో యావరేజ్ గా చదరపు అడుగు రూ. 4,050 ఉండగా.. కొండాపూర్, కోకాపేట్, నల్లగండ్ల ఏరియాల్లో ఉన్న సొసైటీల్లో రూ. 9,250 నుంచి రూ. 9,750 రేంజ్ లో ఉన్నాయి. గచ్చిబౌలిలో ఉన్న సొసైటీల్లో రూ. 10,950గా ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న అన్ని చాలా సొసైటీల్లో చదరపు అడుగు రూ. 4 వేల నుంచి రూ. 20 వేల వరకూ పలుకుతున్నాయి. హైదరాబాద్ లో అన్ని ఏరియాల్లో ఉన్న సొసైటీల్లో కంటే మల్లంపేటలో ఉన్న సొసైటీల్లో మధ్యతరగతి వ్యక్తి బడ్జెట్ లో ఫ్లాట్ అనేది దొరుకుతుంది.
గమనిక: సొసైటీల్లో ఫ్లాట్ లేదా విల్లా కొనేముందు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.