పిల్లలకు జన్మనివ్వడమే కాదు వారికి బంగారు భవిష్యత్ అందించడం కూడా తల్లిదండ్రుల బాధ్యతే. వారికి విద్యా బుద్ధులను నేర్పించి వారి కాళ్లమీద వారు నిలబడేలా ఉన్నత స్థాయికి చేర్చాలని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు. కానీ అందుకు అనుగుణంగా ప్రణాళికలు చేసుకోలేక విఫలమవుతారు. తమ వద్ద ఉన్న ఆర్థిక వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే పిల్లలకు మంచి భవిష్యత్ అందించడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి అవసరాలు పెరుగుతుంటాయి. విద్య, పెళ్లి.. వంటి వాటి కోస పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకోసం.. ఇప్పటినుంచే ఆదాయ మార్గాలను పెంచుకోవాలి. ఏదేని పొదుపు/ఇన్సూరెన్స్ పథకంలో పెట్టుబడి ప్రారంభించడం ద్వారా దీర్ఘకాలంలో అధిక మొత్తంలో ప్రయోజనం పొందొచ్చు.
మీచేతిలో ఉన్న సొమ్ము మీదగ్గరే ఉంటే దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే ఆ సొమ్ము మరింత పెరిగేందుకు ఉన్న మార్గాలపై దృష్టి సారించాలి. అలాంటి మంచి ప్రయోజనాలు అందించే పాలసీ గురుంచి మీకు వివరాలు అందిస్తున్నాం. ఇందులో పెట్టుబడి
ప్రారంభించి మీ పిల్లల భవిష్యత్‌కు పునాది వేసుకోండి.. దేశీయ భీమా సంస్థ ఎల్ఐసీ అందిస్తోన్న ఈ పాలసీ పేరు.. ‘ఎల్‌ఐసీ న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్’. ఇందులో రోజుకు రూ.206 పొదుపు చేస్తూ పోతే 25 ఏళ్ల తర్వాత రూ.27 లక్షలు చేతికొస్తాయి. ఇవి మీ అవసరాలకు, మీ పిల్లల భవిష్యత్‌కు చక్కగా ఉపయోగపడతాయి. ఈ పాలసీ గురుంచి మరిన్ని వివరాలు సంక్షిప్తంగా మీకోసం..
0 నుంచి 12 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లల పేరుపై ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీసం రూ.లక్ష మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంత మొత్తానికి అయినా పాలసీ తీసుకోవచ్చు. మీరు ఎంత బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటారనే అనే దానిపై ఆధారపడి మీ ప్రీమియం ఉంటుంది. ఈ పాలసీ మెచ్యూరిటీ వ్యవధి 25 ఏళ్లు. అంటే.. మీ పిల్లలకు 25 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ పాలసీ గడువు ముగుస్తుంది. ఉదాహరణకు మీ పిల్లలు పన్నెండేళ్లు ఉంటే.. మెచ్యూరిటీ 13 ఏళ్లుగా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు అయిదేళ్లు ఉంటే.. 20 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ తీరుతుంది.
పిల్లలకు 18 ఏళ్లు, 20 ఏళ్లు, 22 ఏళ్లు వచ్చినప్పుడు పాలసీ మొత్తంలో 20 శాతం డబ్బులు చెల్లిస్తూ వస్తారు. మిగతా 40 శాతం డబ్బులను 25 ఏళ్లు వచ్చిన తర్వాత చెల్లిస్తారు. ఇంకా బోనస్ వంటివి వస్తాయి. ఇక ప్రీమియం విషయానికొస్తే.. పాలసీదారులు 1 నెల, 3 నెలలు, 6 లేదా ఏడాదికి ఒకసారి చెల్లించవచ్చు. ఇందులో రూ.14 లక్షలకు పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీ తర్వాత రూ.27 లక్షలు మీ చేతికొస్తాయి. దీర్ఘకాలంలో పిల్లల భవిష్యత్‌కు ఎక్కువ మొత్తంలో డబ్బులు అవసరం రావొచ్చు. కావున ఇలాంటి ఏదేని పథకంలో చేరి.. మీ పిల్లల కలలను సాకారం చేయండి. ఈ పాలసీపై.. మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ల రూపంలో తెలియజేయండి.