‘గౌతమ్ అదానీ…’ ప్రపంచ బిలియనీర్లలో ఒక్కరు. అతి తక్కువ సమయంలోనే అంబానీని కూడా దాటేసి అదానీ సంపన్నడిగా మారాడు. అంబానీ కిందిస్థాయి నుంచి ఎదిగినట్లుగా ప్రపంచానికి తెలుసు. అందువల్ల ఆయన బిలియనీర్ జాబితాలో చోటు సంపాదించుకోవడం ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చు. కానీ, అదానీ.. అలా కాదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన సంపద రెట్టింపు అవుతూ వచ్చింది. ఆంతీకాలంలోనే అంబానీని మించిన బిలియనీర్ గా జాబితాలోకెక్కారు. అందుకు కారణం.. షేర్ మార్కెట్. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టె వారి సంఖ్య భారీగా పెరగడంతోనే.. ఆయన కంపనీల షేర్ విలువ పెరిగి భారీగా లాభాలు గడించాయి. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో భారతీయ స్టేట్ బ్యాంక్, ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి.
అయితే.. అదానీ ఆస్తులకు సంబంధించి ఇటీవల అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ హిన్డెన్బర్గ్ రీసెర్చ్ ఒక నివేదికను బయటపెట్టింది. ఆ నివేదిక.. అదానీ వ్యాపార సామ్రాజ్యం ఓ పేక మేడ అని తేల్చింది. అదానీ గ్రూప్‌లో ఆర్థిక పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని తెలిపింది. అంతా బాగానే ఉందని ప్రపంచానికి చూపించుకునేందుకు.. అదానీ సిబ్బంది తప్పుడు మార్గాల్లో అడుగులు వేస్తున్నారని వివరించింది. కరీబియన్ దేశాలు మొదలుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు వివిధ దేశాల్లో అదానీ కుటుంబ సారథ్యంలోని షెల్ కంపెనీలు ఒక పద్ధతి ప్రకారం పని చేస్తున్నాయని హిండెన్‌బర్గ్ తెలిపింది.
ఈ రిపోర్ట్ దెబ్బకు దెబ్బకు అదానీ షేర్లు స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ కారణంగా.. అదానీ సంస్థల్లో అతి పెద్ద పెట్టుబడిదారుల్లో ఒకటిగా ఉన్న ప్రభుత్వ భీమా సంస్థ ఎల్‌ఐసీకి చెందిన రూ. 16,580కోట్ల సంపద ఆవిరయ్యింది. ఒక్క అదానీ టోటల్ గ్యాస్లోనే రూ. 6,232కోట్లు నష్టపోయింది. ఇందులో ఎల్‌ఐసీకి 5.96శాతం వాటా ఉంది. 2022 డిసెంబర్ త్రైమాసికం నాటికి అదానీ టోటల్ గ్యాస్‌లో 2,03,09,080 షేర్లను ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది.మొత్తం 2,03,09,080 షేర్లను ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో ఈ నెల 24 నాటికి ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ.81,268 కోట్లు కాగా, శుక్రవారం(జనవరి 26) నాటికి రూ.61,621 కోట్లకు పడిపోయింది.
This is SHOCKING! Why indian agencies aren’t investigating this man ?#Adani#Hindenburg #LIC pic.twitter.com/btn7F3VoOi
— Inquilab India News (@inquilaab_india) January 28, 2023
అయితే, హిండెన్‌బర్గ్ నివేదికను అదానీ గ్రూప్ ఖండించింది. అదంతా ఒక అవాస్తవమని పేర్కొంది. వాస్తవాలను తెలుసుకోకుండా నివేదికను విడుదల చేయడం తమను విస్మయానికి గురి చేసిందని వ్యాఖ్యానించింది. అదానీ గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రధాన లక్ష్యంతోనే ఇలా చేసినట్లు స్పష్టం అవుతోంది అని వ్యాఖ్యానించింది. ఈ నివేదికను అవాస్తమని పేర్కొన్నప్పటికీ.. నిజ నిజాలెంటో బయటకు చెప్పలేదు. దీంతోనే నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. హిన్డెన్బర్గ్ రిపోర్ట్ దెబ్బకు ఎందరో మదుపర్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అదానీ సంపదపై, హిన్డెన్బర్గ్ రిపోర్ట్, ఎల్‌ఐసీ నష్టాలపై.. మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ల రూపంలో తెలియజేయండి.