అర్హతలు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. మరి ప్రభుత్వ పథకాలకు అర్హత ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? అసలు మనకు ఎన్ని ప్రభుత్వ పథకాలకు అర్హత ఉందో ఎలా తెలుస్తుంది. అంటే ఒకే ఒక్క నిమిషంలో మనకు ఎన్ని పథకాలు వర్తిస్తాయి అనే వివరాలను తెలుసుకోవచ్చు.
ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వారికి కొన్ని పథకాలు ప్రవేశపెడుతుంది. లోన్లు, సబ్సిడీలు వంటివి ఇస్తుంటుంది. అయితే ఏ పథకం ఎవరికి వర్తిస్తుందో అనే విషయం మీద ఎవరికీ సరైన అవగాహన ఉండదు. ఎన్ని పథకాలు వర్తిస్తాయి అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. దేశం మొత్తం మీద 669 ప్రభుత్వ పథకాలు ఉండగా.. ఇందులో కేంద్ర ప్రభుత్వానివి 225 పథకాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పథకాలు 20, తెలంగాణ పథకాలు 11 ఉన్నాయి. అన్ని రాష్ట్రాలూ కలిపి 444 పథకాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్ని పథకాలకు అర్హత ఉంది అనే విషయాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఎన్ని ప్రభుత్వ పథకాలు మనకి సూటవుతాయో.. ఎన్ని పథకాలకు మనకి అర్హత ఉందో అనే విషయాన్ని ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాదు ఈ పథకానికి ఆన్ లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు.
అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ముందుగా మన వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత మనకు సూటయ్యే పథకాల జాబితా వస్తుంది. వాటిలో మనకు సూటయ్యే పథకానికి అప్లై చేసుకోవచ్చు. మొదటగా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మైస్కీం డాట్ జీవోవీ డాట్ ఇన్ లోకి వెళ్ళాలి. వెబ్ సైట్ ఓపెన్ చేయగానే ఫైండ్ స్కీమ్స్ ఫర్ యు అనే బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మాగోనివేనా నువ్వు అనో, లేదా అమ్మాయివా? ట్రాన్స్ జండర్ వా అని అడుగుతుంది. మీరు ఏదైతే ఆ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత వయసు నమోదు చేయాలి. తర్వాత రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని.. ఏరియా అర్బన్ అయితే అర్బన్ అని, రూరల్ అయితే రూరల్ అని ఎంపిక చేయాలి. ఆ తర్వాత సామాజిక వర్గాన్ని ఎంపిక చేసుకోవాలి. దివ్యాంగులైతే యస్ మీద, కాకపోతే నో మీద క్లిక్ చేయాలి. మైనారిటీకి చెందిన వారు ఐతే యస్ మీద, కాకపోతే నో మీద క్లిక్ చేయాలి.
స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని, లేకపోతే ఉద్యోగి, నిరుద్యోగి, స్వయం ఉపాధి, ఎంటర్ప్రెన్యూర్ లలో ఏదో ఒకటి ఎంపిక చేయాలి. ప్రభుత్వ ఉద్యోగి అయితే అవును అని ఎంపిక చేసుకుని మీది, మీ కుటుంబం యొక్క వార్షిక ఆదాయం నమోదు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగి కాకపోతే నో మీద క్లిక్ చేయాలి. మీ ఆక్యుపేషన్ నమోదు చేయాలి. మీరు దారిద్య్ర రేఖకు దిగువున ఉంటే యస్ అని, లేదంటే నో మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు సూటయ్యే పథకాల జాబితా వస్తుంది. వాటిలో మీకు సూటయ్యే పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఇందులో సోషల్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ స్కీం, అగ్రికల్చర్, రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్, హెల్త్ అండ్ వెల్నెస్, స్కిల్స్ అండ్ ఎంప్లాయిమెంట్, హౌసింగ్ అండ్ షెల్టర్, స్పోర్ట్స్ అండ్ కల్చర్ వంటి పథకాల్లో మీకు సూటయ్యే వాటిని చూపిస్తారు.