ఏపీలో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు జగన్ సర్కార్ వరుసగా శుభవార్తలు తెలుపుతుంది. వచ్చే నెల నుండి అమలు అవుతున్న రెండు విషయాలను ఏపీ పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రజలకు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ప్రజల మద్దతు కోసం ఇప్పటి నుంచి పలు రకాల వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్యనందించుటకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విద్యార్థులను చదివించుటకు తల్లులకు అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక వంటి పలు పథకాలను పక్కాగా అమలు చేస్తుంది. అక్షరాస్యత శాతం పెంచేందుకు విద్యారంగంలో ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగన్ సర్కార్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ‘వైఎస్ఆర్ పెన్షన్ కానుక’ ద్వారా 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్, ఇళ్లు లేని ‘పేదలకు ఇళ్లు’, ‘జగనన్న చేదోడు’, ‘వైఎస్ఆర్ చేయూత’ వంటి సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారు.
ఏపీలో జగన్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధిదారులకు అకౌంట్లో డబ్బులు జమకానున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు.
పలు పథకాల ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం వారికి కూడా లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రస్తుతం ఒక రేషన్ కార్డు ఒక పెన్షన్ అనే విధానం అమలు అవుతుంది. ఇకపై ఒకే కుటుంబంలో రెండో వ్యక్తికి కూడా పెన్షన్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి పథకాలు వస్తున్నాయంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు చెప్పండి. వెయ్యి, రెండు వేలు ఇస్తుందంటే ఆ డబ్బు కోసం కోటీశ్వరుడు కూడా కక్కుర్తిపడతాడు. డబ్బున్న వాళ్ళే అంతలా ఎగబడుతుంటే నిజమైన అర్హులు పేదవారు ఎగబడరా. కానీ ఒక మహిళ తనకు ప్రభుత్వం ఇండ్ల స్థలం ఇస్తే వద్దని చెప్పేశారు. ఇండ్ల స్థలం ఇస్తే వద్దని ఎవరైనా అంటారా?
అర్హతలు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. మరి ప్రభుత్వ పథకాలకు అర్హత ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? అసలు మనకు ఎన్ని ప్రభుత్వ పథకాలకు అర్హత ఉందో ఎలా తెలుస్తుంది. అంటే ఒకే ఒక్క నిమిషంలో మనకు ఎన్ని పథకాలు వర్తిస్తాయి అనే వివరాలను తెలుసుకోవచ్చు.