చాలా మంది చిన్నపిల్లలకు సంబంధించిన సబ్బులు, పౌడర్లు ఇతర ఉత్పత్తుల మొత్తం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీవి వాడేవారు. పిల్లల ఉత్పత్తుల అమ్మాకాల్లో కొన్నేళ్ల పాటు ప్రపంచ మార్కెట్లో ఈ కంపెనీ గుత్తాధిపత్యం ప్రదర్శించింది. అయితే, ఈ సంస్థ నుంచి వచ్చిన బేబీ పౌడరులో గర్భాశయ క్యాన్సర్ ను కలిగించే అస్బెస్టాస్ వంటి హానికారక రసాయనం ఉన్నట్టు తేలడంతో అమెరికా, కెనడాలు రెండేళ్ల కిందటే దీనిని నిషేధించాయి. ఈ ఉత్పత్తిని కొనుగోలుచేసిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ వేలాదిగా వ్యాజ్యాలను కోర్టుల్లో దాఖలు చేశారు. ఈక్రమంలో తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఓ నిర్ణయం తీసుకుంది. 2023లో ప్రపంచ వ్యాప్తంగా తమ ఉత్పత్తులను నిలిపివేయాలని నిర్ణయించింది.
చిన్నపిల్లకు సంబంధించిన ఉత్పత్తుల అమ్మకాల్లో కొన్నేళ్లు జాన్సన్ అండ్ జాన్సన్ దూసుకెళ్తుంది. ప్రతి ఒక్క వినియోదారుడు పిల్లలకు సంబంధించిన పౌడర్, సబ్బు,ఇతర నూనెల విషయంలో జాన్సన్ కంపెనీ వాటికే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు. కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విక్రయిస్తున్నారు. ఆస్బెస్టాస్ అనే క్యాన్సర్ కారకంతో కలుషితం కావడం వల్ల దాని టాల్క్ ఉత్పత్తులు వ్యాధికి కారణమయ్యాయని 38 వేల వ్యాజ్యాలను కోర్టుల్లో వేశారు. అయితే 2020 జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడరులో కేన్సర్ కారకాలున్నట్టు ల్యాబ్ పరీక్షల్లో తేలింది.
దీంతో అమెరికాలోని వేలాది మంది వినియోగదారులు భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో అమెరికా, కెనడాలు ఈ పౌడర్ అమ్మకాలను నిలిపివేశాయి. ఈ క్రమంలో ఈ కంపెనీ ఉత్పత్తులపై మరి కొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలను 2023లో నిలిపివేయాలని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తాజాగా ప్రకటించింది.
ఈ నిర్ణయంపై కంపెనీ అధికారులు మాట్లాడతూ..”దీర్ఘకాలిక వృద్ధి కోసం వ్యాపారాన్ని ఉత్తమంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మా పోర్ట్ ఫోలియోను మేము మూల్యాంకనం చేస్తాం. ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయం పోర్ట్ పోలీయో మదింపులో భాగమే. ఇది భౌగోళిక ప్రాంతాలలో మా ఉత్పత్తులకు డిమాండ్ లో ఉన్న తేడాలు, వినియోగాదులు ఆలోచనలు మొదలైన అంశాలను విశ్లేంచింది” అని పేర్కొన్నారు. మరి.. తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఈ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.