ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను ఉచితంగా అందిస్తోన్న రిలయన్స్ సంస్థ వడ్డన షురూ చేసింది. జియో సినిమా యాప్‌కు చెందిన సబ్ స్క్రిప్షన్ ధరలు ఇవేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ధరలు ఇతర ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే తక్కువనే చెప్పాలి.
ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారంతో ‘జియో సినిమా‘ యాప్ పాపులారిటీ బాగానే పెరిగిందనే చెప్పాలి. టోర్నీ ప్రారంభమైన ఒక్క మొదటి వారంలోనే దాదాపు 5 కోట్లకు పైగా డౌన్ లోడ్లు అయ్యాయంటే.. ఈ యాప్ ఏ రేంజులో దూసుకెళ్ళిందో అర్థం చేసుకోవాలి. ఈ అవకాశాన్ని ఆయుధంగా మలుచుకొన్న రిలయన్స్ సంస్థ వడ్డన షురూ చేసింది. గతంలో ఈ యాప్‌ను.. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, వాల్ట్ డిస్నీ వంటి అంతర్జాతీయ స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లతో తీర్చిద్దిద్దుతామని ప్రకటన చేసినప్పటికీ ప్లాన్ ధరలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇప్పుడు జియో సినిమా ప్లాన్ ధరలివే.. అంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మొదట ఉచితంగా అలవాటు చేయడం, ఆ తర్వాత డబ్బులు ఛార్జ్ చేయడం అనేది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ బిజినెస్ స్ట్రాటజీ. ఇక్కడా అదే అమలుచేశారు. వర్కౌట్ అయ్యింది కూడాను. ఈ యాప్ లో ఐపీఎల్ ప్రసారాలు ఉచితం కావడంతో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. అంతేకాదు.. కేవలం జియో సిమ్ ఉన్నవాళ్లకు మాత్రమే కాకుండా అందరికి ఉచితం కావడంతో అందరి మొబైళ్ళలోనూ ఈ యాప్ డౌన్ లోడ్ అయ్యింది. ఈ ఆదరణను కొనసాగించడం కోసం జియో సినిమాను స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌గా మార్చేశారు. నిర్వాహకులు. సినిమాలు, టీవీ సిరీస్‌లు వంటి కొత్త కంటెంట్ యాడ్ చేసి.. సబ్ స్క్రిప్షన్ ధరలు అమలు చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్లాన్ ధరలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతానికి మూడు ప్లాన్లను ఇందులో లిస్ట్ చేశారు. ఆ వివరాలు..
అయితే ఇవి ఆఫర్ ధరలు అని తెలుస్తోంది. డైలీ ప్లాన్ అసలు ధర రూ.29 కాగా, ఆఫర్ కింద రూ.2కే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే గోల్డ్ ప్లాన్ అసలు ధర రూ.299 కాగా రూ.99కే అందిస్తున్నారు. ఇక ప్లాటినం ప్లాన్ అసలు ధర రూ.1,199 కాగా రూ.599కే అందిస్తున్నారు. అలాగే ఈ ధరలపై, ఎప్పటినుండి అమలుకానున్నాయో అన్న దానిపై స్పష్టత లేదు. కాగా, ఐపీఎల్ మ్యాచులకు మాత్రం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని సంస్థ గతంలోనే పేర్కొంది. ఐపీఎల్ మ్యాచులు మే 28వ తేదీతో ముగియనున్నాయి. ఆలోపే ఈ ధరలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
The pricing of #JioCinema‘s upcoming Premium subscription plans has been leaked prior to it’s official announcement, revealing a daily plan of ₹2 and a 3-month plan for ₹99. pic.twitter.com/gm9dsPpuI6
— DealzTrendz (@dealztrendz) April 24, 2023