క్రికెట్ అంటే చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ని అభిమానించే వాళ్లు కోట్ల మంది ఉంటారు. ఇక క్రికెట్ స్థితి.. గతిని మార్చింది ఐపీఎల్. అన్నిదేశాల ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడుతుంటారు.
ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను ఉచితంగా అందిస్తోన్న రిలయన్స్ సంస్థ వడ్డన షురూ చేసింది. జియో సినిమా యాప్‌కు చెందిన సబ్ స్క్రిప్షన్ ధరలు ఇవేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ధరలు ఇతర ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే తక్కువనే చెప్పాలి.