ఐర్లాండ్ తో నేడు తొలి టీ 20 మ్యాచ్ ఆడబోతున్న భారత్.. 20 న రెండో టీ 20, 23 న మూడో టీ 20 ఆడనుంది. ఇక ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడో ఇప్పుడు చూద్దాం.
ఐర్లాండ్ తో టీ 20 సిరీస్ కోసం టీమిండియా కుర్రాళ్ళు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నారు. ఓ వైపు సీనియర్లు ఆసియా కప్ కి సన్నద్ధమవుతుంటే కుర్రాళ్ళు టీ 20 ల్లో తమ సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఐర్లాండ్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు యువ టీమిండియా ఐరిష్ గడ్డపై ఇప్పటికే అడుగు పెట్టి ప్రాక్టీస్ ప్రారంభించేసింది. నేడు భారత్-ఐర్లాండ్ మధ్య డబ్లిన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు స్టార్ బౌలర్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దాదాపు ఏడాది తర్వాత గాయం నుంచి తిరిగి వచ్చిన బూమ్రా మీదే అందరి కళ్ళు ఉన్నాయి. ఆసియా కప్ ముందు బూమ్రాకి ఈ సిరీస్ ప్రాక్టీస్ ఎంతలా ఉపయోగపడుతుందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడో ఇప్పుడు చూద్దాం.
ఐర్లాండ్ తో నేడు తొలి టీ 20 మ్యాచ్ ఆడబోతున్న భారత్.. 20 న రెండో టీ 20, 23 న మూడో టీ 20 ఆడనుంది. ఈ మూడు మ్యాచులు కూడా డబ్లిన్ వేదికగా జరుగుతాయి. మ్యాచులన్నీ భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతాయి. అయితే.. ఈ మూడు మ్యాచ్ సిరీస్‌ను స్పోర్ట్స్ 18 ఛానెల్‌తో పాటు, డీడీ స్పోర్ట్స్(ఫ్రీ డిష్)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే జియో సినిమా యాప్‌లో కూడా మ్యాచ్‌ను లైవ్ చూడొచ్చు. దూరదర్శన్‌లో మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించే అవకాశం ఉంది. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచులు కూడా జియో సినిమాలోనే ప్రసారమైన సంగతి తెలిసిందే.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే కుర్రాళ్లతో నిండిన టీమిండియా చాలా పటిష్టంగా కనిపిస్తుంది. తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, సంజు శాంసన్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, శివమ్ దూబే ఇలా అంత తమను తాము నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మరో వైపు పసికూనే కదా అని ఐర్లాండ్ ని తక్కువ అంచనా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇటీవలే ఆ జట్టు పెద్ద జట్లకు సైతం షాక్ ఇస్తుంది. గతేడాది జరిగిన సిరీస్ లో కూడా ఐరిష్ టీం గట్టి పోటీ ఇచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలి. మొత్తానికి సొంత గడ్డపై ఐర్లాండ్ తో యంగ్ ఇండియన్స్ ఎంతవరకు ప్రభావం చూపిస్తారో వేచి చూడాల్సిందే. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.