భూమి తన చుట్టూ తాను తిరుగుతూ.., సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ.., భూమి మీద అన్నటినీ తన చుట్టూ తిప్పుకునేది డబ్బు ఒక్కటే. ఈ ప్రపంచంలో ఏ పని చేయాలన్నా డబ్బు కావాల్సిందే. ఇదే సమయంలో డబ్బు సంపాదించడానికి కూడా అనేక మార్గళ్జు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచం అంతా నెట్టిల్లు అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలోనే లక్షలు సంపాదించే మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ కూడా తన యూజర్స్ కి ఈ అవకాశం అందివ్వడానికి ముందుకి వచ్చింది. ట్విట్టర్ ఇప్పటికే సూపర్ ఫాలో అనే ఫీచర్‌ను తీసుకొచ్చి సక్సెస్ అవ్వడంతో.., ఇన్ స్టా ఈ విషయంలో సరికొత్త ఆలోచనతో ముందుకి వచ్చింది. ఇందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌క్లూజివ్ స్టోరీస్ అనే ఫీచర్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంభందించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ నుంచి క్రియేటర్ బ్యాడ్జ్ సాధించిన వారికి ఈ అవకాశం ఉంటుంది. ఇకపై ఈ బ్యాడ్జ్ ఉన్న వారి స్టోరీలను కూాఅందరూ చూడలేరు. డబ్బులు చెల్లించి మెంబర్ షిప్ తీసుకున్న వారు మాత్రమే వీరి కంటెంట్‌ను చూసే వెసులుబాటు కల్పించారు. సో.., ఒక్కసారి మీరు ఇన్ స్టాలో క్రియేటర్ బ్యాడ్జ్ సాధిస్తే ఇకపై లక్షలు మీ సొంతం అనమాట.
ప్రస్తుతానికిఈ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. తర్వాత యూజర్స్ నుండి డబ్బులు వసూలు చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా యూజర్లకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం. ఇన్ స్టాలో అద్భుతమైన కంటెంట్ మీరు క్రియేట్ చేయగలిగితే లక్షలు మీ సొంతం అయినట్టే.