హ్యూండాయ్ మోటార్ ఇండియా వాహనదారులకు తీపి కబురును అందించింది. సరికొత్త టెక్నాలజీతో క్రెటా అప్ డేటెడ్ వర్షన్-2022 ను హ్యూండాయ్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వాహనంలో సరికొత్త మార్పులు, చేర్పులు చేశామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. క్రెటా అప్ డేటెడ్ వర్షన్ రూ.12.83 ఉండగా 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమెటిక్ వెర్షన్లలో లభించే నైట్ ఎడిషన్ పెట్రోల్ ట్రిమ్ ధర మాత్రం రూ. 13.51 లక్షల నుంచి 17.22 వరకు ఉంటుందని కంపెనీ తాజాగా ప్రకటించింది.
ఇది కూడా చదవండి: LIC IPO సందడి షురూ! మే 4 నుంచి 9 వరకు ఇష్యూ..!
ఇక ఈ సరికొత్త క్రెటాలో డీసీటీ గేర్ బాక్స్ తో కూడిన 1. 4 టర్బో పెట్రోల్ ఇంజిన్ తో ఎస్ ప్లస్ వేరియంట్ ను కొత్తగా ప్రవేశపెట్టామని తెలిపింది. అయితే అత్యాధునిక టెక్నాలజీతో పాన్ రొమిక్ సన్ రూఫ్, వైర్ లెస్ ఛార్జర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పవర్ విండో సహా మరిన్ని సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టామని కంపెనీ తాజా ప్రకటనలో తెలిపింది. ఈ సరికొత్త ఆఫర్లతో మనముందుకొచ్చిన ఈ క్రెటా కొత్త వెర్షన్ ను కొనుగోలు చేసేందుకు వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.