దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన కార్లు, బైకులు ఏవన్న విషయపై ఓ ఆటో ఈ-కామర్స్ సంస్థ సర్వే చేపట్టింది. ముఖ్యంగా మధ్యతరగతి వారిని బేస్ చేసుకొని ఈ సర్వే చేపట్టగా, అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎక్కువ మంది ప్రజలు మీడియం రేంజ్ కార్లను, బైకులనే ఇష్టపడుతున్నట్లు సర్వేలో స్పష్టమైంది. ప్రజల మనసు చూరగొన్న ఆ కార్, బైక్ ఏదో తెలియాలంటే కింద చదివేయండి..
దేశంలో వాహన వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చిన నాటి నుంచి వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఎక్కువ మంది కార్ల కొనుగోలుకే మక్కువ చూపుతున్నారు. ఫలితంగా ఇండియా.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ గా అవతరించింది. వీటిల్లో అత్యంత ప్రజాదారణ పొందిన కార్లు, బైకులు ఏవి? అన్న విషయంపై ఓ ఆటో ఈ-కామర్స్ సంస్థ సర్వే చేపట్టగా ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి.
డ్రూమ్స్ యాన్యువల్ ’ఇండియా ఆటోమొబైల్ ఈ-కామర్స్ రిపోర్ట్’ ప్రకారం.. 2022లో దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన కారుగా కొరియన్ ఆటోమొబైల్ సంస్థ ‘హ్యుందాయ్’కు చెందిన క్రేటా ఎస్యూవీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో మరో కొరియన్ సంస్థకు చెందిన కియా సెల్టోస్ నిలవగా, దేశీయ ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ బ్రెజా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక ఎంపీవీ- పెద్ద ఎస్యూవీల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యునర్లు నిలిచాయి.
ఇక టూ వీలర్ సెగ్మెంట్ల విషయానికొస్తే.. హీరో మోటోకాప్తో పోల్చుకుంటే బజాజ్ ఆటో మోడల్స్ పై ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. యువత ఎక్కువగా బజాజ్ పల్సర్ వైపే మొగ్గుచూపినట్లు తాజా అధ్యయనంలో తేలింది. తరువాతి స్థానాల్లో హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్,టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్, హోండా సీబీ షైన్ నిలిచాయి. ఇక లగ్జరీ బైక్స్ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్, హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750, కవాసాకీ నింజా జెడ్ఎక్స్-10ఆర్ వంటివి తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఈ సర్వేలో తేలిన మరో ముఖ్య విషయం.. రాను.. రాను.. ఆటోమెటిక్ గేర్బాక్స్ ఉన్న వాహనాలకు ఆదరణ పెరుగుతోందని స్ఫష్టమైంది. 2015లో ఆటోమెటిక్ గేర్బాక్స్ వాహనాల వాటా 23శాతంగా ఉండగా, 2022కు అది 33శాతానికి పెరిగింది. అదే సమయంలో డీజిల్ వాహనాల కొనుగోళ్లు తగ్గుముఖం పడుతున్నట్లుగా తేలింది. 2021లో 60శాతంగా ఉన్న డీజిల్ వాహనాల వాటా.. 2022లో 53శాతానికి పడిపోయింది. ఇక మొత్తం వాహనాల విక్రయాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాటా 1శాతంగానే ఉందని సర్వేలో వెల్లడైంది. మీకు ఏ కారు..? ఏ బైక్ అంటే ఇష్టమో.. అభిపాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hyundai Creta, Bajaj Pulsar Emerges As Most Popular Car and Bike: Droom India Automobile Ecommerce Report 2022https://t.co/aXCrTw5weC#HyundaiCreta #BajajPulsar #Hyundai #Bajaj @HyundaiIndia #Droom
— LatestLY (@latestly) February 27, 2023