హ్యూండాయ్ కార్లకు దేశవ్యాప్తంగా ఎంతో మంచి మార్కెట్ ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ తీసుకొచ్చిన ఎన్నో మోడల్స్ కు మార్కెట్ లో మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి ఎక్స్ టర్ అనే కొత్త మోడల్ విడుదల కానుంది. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ని విడుదల చేశారు.
హ్యూండాయ్ మోటర్ ఇండియా కార్లకు భారతదేశంలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఇప్పటికే హ్యూండాయ్ నుంచి వచ్చినే చాలా మోడల్స్ వినియోగదారుల మన్ననుల పొందుతున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి ఒక మైక్రో ఎస్ యూవీ రాబోతోంది. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ని రివీల్ చేశారు. ప్రస్తుతానికి ఈ మోడల్ కి సంబంధించిన ఎలాంటి వివరాలను బయటపెట్టలేదు. కానీ లుక్స్ పరంగా, ఆటో మొబైల్ రంగంలో వినిపిస్తున్న అంచనాల ప్రకారం ఈ కారు కచ్చితంగా టాటా పంచ్ మోడల్ కు ప్రైస్, ఫీచర్స్, లుక్స్ అన్ని విషయాల్లో గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ హ్యూండాయ్ ఎక్స్ టర్ 2023 జులై నుంచి తయారీ స్టేజ్ కు చేరుకుంటుందని చెబుతున్నారు.
హ్యూండాయ్ రిలీజ్ చేసిన లుక్స్ ప్రకారం.. ఎక్స్ టర్ లో H ఆకారంలో ఎల్ఈడీ DRLలతో స్ల్పిట్ హెడ్ ల్యాంప్స్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఇంక ఫ్రంట్ సైడ్ ఉన్న బ్లాక్ గ్రిల్ మొత్తం మీకు హ్యూండాయ్ వెన్యూని గుర్తు చేస్తుంది. నిజానికి లుక్స్ లో ఈ ఎక్స్ టర్ మినీ వెన్యూని చూస్తున్నట్లుగానే ఉంది. ఈ కారు గ్రీన్ కలర్ లో అందుబాటులో ఉంటుందని చెప్పకనే చెప్పారు. లుక్స్ పరంగా చూస్తే ఈ మోడల్ కి మంచి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంటుందని అర్థమవుతోంది. అయితే ఈ హ్యూండాయ్ ఎక్స్ టర్ మోడల్ కు సంబంధించిన ధర, ఇంజిన్, ఇంటీరియర్ వంటి ఎలాంటి స్పెసిఫికేషన్స్ ని అధికారికంగా రివీల్ చేసింది లేదు.
Hyundai EXTER.
First look.
Get ready.
Coming soon.
Think outside. Think EXTER.
To know more, click here: https://t.co/JgP6L0MUai#Hyundai #HyundaiIndia #HyundaiEXTER #Thinkoutside #ComingSoon #ILoveHyundai pic.twitter.com/ZlbTIMowia— Hyundai India (@HyundaiIndia) April 25, 2023
హ్యూండాయ్ ఎక్స్ టర్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. హ్యూండాయ్ ఐ10, నియోస్ వంటి మోడల్స్ కు దగ్గరగా ఉండేలా ఇంటీరియర్ ఉంటుందని చెబుతున్నారు. దీనిలో టచ్ స్క్రీన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంక ఇంజిన్ విషయానికి వస్తే.. హ్యూండాయ్ వెన్యూ, ఐ20, ఆరా వంటి మోడల్స్ లో వస్తున్న 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఇందులో ఆటోమోటిక్, మాన్యువల్ రెండు వేరియంట్లు ఉండచ్చు. దీని ధరకి సంబంధించి చాలా అభిప్రాయాలు ఉన్నాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.6 లక్షల నుంచి రూ.9.5 లక్షల వరకు ఉండచ్చని అంచనా వేస్తున్నారు. దీనిని భారత్ నుంచే విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నాయి. 2023 ఆగస్టు సమయంలో లాంఛ్ చేస్తారని చెబుతున్నారు. ఆ సమయంలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.