RBI: బ్యాంకులకు వెళ్లటం అంటే అదేదో ఇబ్బందిలాగా ఫీలవుతుంటారు చాలామంది. ఎంతో ముఖ్యమైన పనైతేనే కానీ, వెళ్లటానికి ఇష్టపడరు. ఇందుకు కారణం లేకపోలేదు. బ్యాంకు సిబ్బంది తమ ఖాతాధారులను ట్రీట్ చేసే విధానం. కొంతమంది బ్యాంకు సిబ్బంది చిన్న పనికి కూడా విసుగు తెప్పించేస్తుంటారు. తమ ఖాతాదారులను చాలా దారుణంగా ట్రీట్ చేస్తుంటారు. కోప్పడుతుంటారు కూడా. నిమిషంలో అయిపోయే పనికి కూడా రోజులు రోజులు సాగదీస్తుంటారు. ‘ఈ బ్యాంకుకు రావటం వద్దు.. బ్యాంకులో అకౌంటు వద్దు’ అనుకునే దుస్థితికి కస్టమర్‌ను తీసుకువస్తారు.
ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక కస్టమర్లు కుమిళిపోతుంటారు. మరికొంతమంది బ్యాంకు సిబ్బందిపై తిరగబడి తిట్టి, అక్కడినుంచి వెళ్లిపోతుంటారు. అయినా బ్యాంకు సిబ్బందిలో మార్పు రాదు. అలాంటి వారిపై బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని ఉన్నా.. ఎక్కడ చేయాలో తెలియక ఆగిపోతుంటారు కస్టమర్లు. వాస్తవానికి కస్టమర్లు బ్యాంకు సిబ్బంది కారణంగా ఇబ్బందికి గురైతే వారిపై ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఫిర్యాదు చేయొచ్చు. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు ఇవ్వవచ్చు. ఇందుకోసం ఆయా బ్యాంకులు ప్రత్యేకంగా రిడ్రెసల్ నెంబర్‌ను అందుబాటులో ఉంచాయి.
వాటికి మనం ఫిర్యాదు చేయొచ్చు. అంతేకాదు! ఆయా బ్యాంకులకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా మనం ఫిర్యాదు చేయోచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు.. టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-3800 /1-800-11-22-11కి ఫిర్యాదు చేయవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు అయితే బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ లేదా అప్పీలేట్ అథారిటీని సంప్రదించవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్లకు మాత్రమే కాదు! ఆర్‌బీఐ వెబ్‌సైట్ https://cms.rbi.org.inలో కూడా ఫిర్యాదు చేయొచ్చు. మరి, బ్యాంకులో ఇబ్బందులు ఎదురైతే ఏం చేయాలో తెలుసుకున్నారు కాదా.. అయితే, దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Post Office Accounts: పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై మనీ ట్రాన్సఫర్ మరింత సులభంగా.. !