మీరు పోస్టాపీసు ఖాతాదారులా! అయితే.. మీ కోసమే ఈ వార్త. పోస్టాఫీసులు, బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న విషయం అందరకి తెలిసిందే. అయితే.. ఇన్నాళ్లు NEFT, RTGS వంటి ఆన్ లైన్ సేవలకు దూరంగా ఉన్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు, ఆ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ నిర్ణయంతో పోస్టాఫీసు కస్టమర్లు డబ్బు పంపేందుకు మార్గం సులభం కానుంది. ఈ సౌకర్యం 24*7 అందుబాటులో ఉంటుంది. NEFT, RTGS ద్వారా ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బు పంపడం చాలా సులభం. త్వరగా నగదు బదిలీ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. కాకుంటే.. కొన్ని నిబంధనలు ఉన్నాయి. NEFTలో డబ్బును బదిలీ చేయడానికి పరిమితి లేదు. నెఫ్ట్ లావాదేవీలు 30 నిమిషాల చొప్పున సెటిల్ అవుతూ వస్తాయ. అదే.. RTGSలో అయితే, కనీసం రెండు లక్షల రూపాయలను పంపాల్సి ఉంటుంది. రియల్ టైం లో అకౌంట్ లోకి చేరుతాయి. ఛార్జీలు: NEFT: 10 రూపాయల వరకు రూ. 2.25 + GST 10 వేల నుంచి రూ. 1 లక్ష రూపాయల వరకు.. రూ. 4.75 + GST రూ. 1 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు.. రూ. 14.75 + GST, రూ. 2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో రూ. 24.75 + GST చెల్లించాల్సి ఉంటుంది. RTGS: రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు.. రూ.24.50 + GST, రూ. 5 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో రూ. 49.5 0+ GST చెల్లించాల్సి ఉంటుంది. pic.twitter.com/9OlOvyHJec — Govardhan Reddy (@gova3555) July 28, 2022 ఇదీ చదవండి: FD Vs RD: ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్.. ఈ రెండింట్లో ఏది బెటర్ ? ఇదీ చదవండి: RBI వద్ద ఎవ్వరూ క్లెయిమ్ చేయని రూ.48వేల కోట్లు నిధులు! తీసుకోడానికి ఎవరు రావడం లేదు!