రోజూ ఆఫీస్ కు వెళ్లడమంటే అందరికీ విసుగే. ఏదో సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసేవారికి శనివారం, ఆదివారం సెలవులు వస్తాయి కానీ, మీడియా, వైద్యసేవలు, పోలీస్ వంటి విభాగాల్లో ఉన్నవారికి అలాంటి ఏవీ ఉండవు. బాస్ చెప్పాడంటే.. ఆదివారం అయినా ఆఫీస్ కు వెళ్లాల్సిందే. పోనీ, సెలవు తీసుకొని ఎటైనా వెళ్దామా! అంటే.. ఆరోజు కూడా ఫోన్లు వస్తుంటాయి. బాస్ ఆర్డర్ వేశాక చేసేదేమీ ఉంటుంది.. అప్పటిదాకా వేసుకున్న హాలీ డే ప్లాన్స్ అన్నీ పక్కకు పెట్టి ఆఫీసు పనులు చేస్తాం.. ఈ విధానం ఉద్యోగుల రోజువారీ విధులపైన ప్రభావం చూపిస్తోందని, ఫాంటసీ ఫ్లాట్ ఫామ్ కంపెనీ డ్రీమ్ 11 గుర్తించింది. అందుకే.. డ్రీమ్ 11 అన్‌ప్లగ్ పేరుతో కొత్త పాలసీని తీసుకొచ్చింది.
‘డ్రీమ్11 అన్‌ప్లగ్’ కొత్త పాలసీ ప్రకారం.. సెలవులో ఉన్న ఉద్యోగులకు ఆఫీస్‌కు సంబంధించిన ఎలాంటి పని కేటాయించకూడదు. ఒకవేళ పనికి సంబంధించి ఫోన్, మెసేజ్, ఈ-మెయిల్ చేసినా.. బాస్‌తోపాటు, ఫోన్ చేసిన ఉద్యోగికి కంపెనీ జరిమానా విధిస్తుంది. ఈ జరిమానా మొత్తం అక్షరాలా లక్ష రూపాయలు. ఈ విధానంపై కంపెనీ వ్యవస్థాపకులు హర్ష్ జైన్, భవిత్ సేథ్ లు మాట్లాడుతూ.. సెలవులో ఉన్న ఉద్యోగికి ఆఫీసుతో ఎటువంటి సంబంధం ఉండకూడదు. మెయిల్స్ కానివ్వండి.. మెసేజ్‌లు కానివ్వండి.. వాట్సాప్ గ్రూప్ అయినా కానివ్వండి.. సెలవులో ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్ అనే మాట ఎత్తకూడదు. ఈ విధానం వల్ల ఉద్యోగికి తగినంత విశ్రాంతి లబిస్తుంది. తమ కుటుంబాలతో సంతోషంగా ఉంటారు. దీంతో వారి మానస్థితి, జీవన ప్రమాణాలు నాణ్యత, వర్క్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుందని మేము అర్థం చేసుకున్నాం. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాం..” అని తెలిపారు.
ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ వేసే వారికి ఫాంటసీ యాప్ డ్రీమ్11 గురుంచి సుపరిచితమే. క్రికెట్ సహా ఫుట్‌బాల్, టెన్నిస్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ వంటి క్రీడలపై బెట్టింగ్ వేసేందుకు ఈ వేదిక వీలు కల్పిస్తోంది. 2008లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కంపెనీ లాభాలతో దూసుకుపోతోంది. అలాగే.. ఇటీవలి కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు తమ సంస్థలో పనిచేసేందుకు రావాలని డ్రీమ్11 సహ వ్యవస్థాపకుడు హరీశ్ జైన్ ఆహ్వానించారు. డ్రీమ్ 11 తీసుకున్న నిర్ణయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
To address the issue of employees not taking sufficient time off, the Indian fantasy sports website Dream 11 has implemented a policy called the “Dream 11 Unplug.”#Dream11 #sports #employees #startup pic.twitter.com/5skZXMY1CN
— Indian Startup News (@indstartupnews) December 30, 2022