దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సరైన ఉపాధి అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న వారు కొందరైతే.. అవకాశం ఉండి కూడా ఖాళీగా ఉంటున్న చదువుకున్న నిరుద్యోగులు మరికొందరు. వేలు, లక్షలు పెట్టి చదువుకొని ఖాళీగా ఉంటుంటే ఇంట్లో తిడుతున్నారా?. తక్కువ మనీతో మంచి బిజినెస్ ఐడియా ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నారా?. ముఖ్యంగా వ్యాపారంలో రాణించాలి అనుకునేవారు ఇది బిజినెస్ హా? అనే ఆలోచ ధోరణి మానుకోవాలి అప్పుడే వ్యాపారంలో రాణించగలరు. స్థోమతకు తగ్గట్టుగా వ్యాపారాన్ని ఎంచుకొని.. రాణించాక మనకు నచ్చిన వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు. ఇపుడు మనం చెప్పబోయే ఐడియా.. నెలకు 25 నుంచి 30 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి రావొచ్చు. కానీ ఆదాయం మాత్రం మీరు చేసే పనిని బట్టి 50వేల వరకు సంపాదించవచ్చు.
కార్ వాషింగ్ అంటే.. కొందరికి చాలా చీప్‌గా అనిపించవచ్చు. కానీ ఈరోజుల్లో ఇది ఒక ప్రొఫెషనల్ బిజినెస్. కార్ వాషింగ్ చేస్తూ బాగా సంపాదిస్తున్న వారు బోలెడు మంది. ఈ వ్యాపారం బాగా లాభసాటిగా ఉంటే.. దానిని మరింతగా విస్తరించే అవకాశం ఉంటుంది. ఒక మెకానిక్‌ని నియమించి.. కారు రిపేర్ సర్వీస్‌ను కూడా ప్రారంభించవచ్చు. అప్పుడు ఆదాయం కూడా పెరుగుతుంది. కార్ వాషింగ్ కోసం కొన్ని మెషిన్లు అవసరం. మార్కెట్లో అనేక రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.12,000 నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది.మీరు చిన్న స్థాయితో తక్కువ పెట్టుబడితో ప్రారంభించాలనుకుంటే.. తక్కువ ఖర్చుతోనే యంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు. మీ వ్యాపారం బాగా పుంజుకున్న తర్వాత.. అప్పుడు పెద్ద యంత్రాలకు వెళ్లవచ్చు. మొదట రూ.14 నుంచి 16 వేల మధ్యలో యంత్రాన్ని కోనుగోలు చేస్తే సరిపోతుంది. మెరుగ్గా పని చేసే 2 హార్స్ పవర్ ఉన్న యంత్రాలు, పైపులు, నాజిల్స్ అన్ని ఇందులోనే వస్తాయి. ఇవి కాకుండా 9,000-10,000 రూపాయలకు అందుబాటులో ఉండే 30 లీటర్ల వాక్యూమ్ క్లీనర్‌ను తీసుకోవాలి. ఇక షాంపూ, గ్లౌజులు, టైర్ పాలిష్, డ్యాష్‌బోర్డ్ పాలిష్ వంటి వాషింగ్ ఐటమ్స్ అన్నీ కలిపి దాదాపు రూ.1700 నుంచి 2 వేల వరకు అవ్వొచ్చు.
ఇది కూడా చదవండి: తాళిబొట్టు తాకట్టు పెట్టి వ్యాపారంలోకి! విశాఖ మహిళ సక్సెస్ స్టోరీ!
కార్ వాషింగ్ షెడ్‌ని నీటి లభ్యత బాగా ఉన్న చోట ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ రద్దీలేని శివారు ప్రాంతాలైనా పర్లేదు. ఎందుకంటే బాగా రద్దీగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటే..పెట్టాల్సిన వ్యయం కూడా పెరగొచ్చు. ఏదైనా మెకానిక్ షాప్ అందుబాటులో ఉంటే.. వారికి సగం అద్దె చెల్లించి.. అక్కడే కార్ వాషింగ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా చేస్తే డబ్బు ఆదా అవుతుంది. గిరాకీ కూడా పెరుగుతుంది. రిపేర్ చేయించుకునేందుకు వచ్చే కార్లు.. మరమ్మత్తుల అనంతరం మీ షెడ్‌లో వాషింగ్ చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది మంచి ఐడియా. కానీ వ్యాపారం పుంజుకున్నాక ఇబ్బందులు ఉంటాయేమో అనుకుంటే సొంతంగా ఏర్పాటుచేసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి: రూ.11 వేల పెట్టుబడితో.. కోటి రూపాయలు సంపాదించింది!
కార్ వాషింగ్ ఛార్జీలు ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. చిన్న చిన్న పట్టణాల్లో ఒక.. నగరాల్లో ఒకలా ఉంటాయి. సాధారణంగా చిన్న పట్టణాల్లో రూ.150 -450 వరకు వసూలు చేస్తారు. పెద్ద నగరాల్లో దీని ధర రూ. 250 వరకు ఉంటుంది. స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ వెర్నా వంటి కార్లపై రూ.350, ఎస్‌యూవీలపై రూ.450 వరకు వసూలు చేస్తున్నారు. మీరు రోజుకు 7-8 కార్లు వాష్ చేస్తే.. ఒక్కో కారుకు సగటున రూ. 250 సంపాదిస్తే.. ఒక రోజులో రూ. 2000 వరకు సంపాదించవచ్చు. కార్లతో పాటు బైక్ వాషింగ్ కూడా చేయవచ్చు. కార్లు, బైక్‌ల వాషింగ్ చేస్తూ.. అన్ని ఖర్చులు పోగా.. మీరు నెలకు ఈజీగా రూ. 40-50 వేల వరకు సంపాదించవచ్చు. ఈ బిజినెస్ ఐడియాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.