దేశంలో ఎక్కడైనా గానీ 30 శాతం తగ్గింపుతో ఇల్లు లేదా ఫ్లాట్ కొనొచ్చు. రూ. 50 లక్షల ఇల్లు రూ. 35 లక్షలకే వస్తుంది. అదెలాగంటే?
30 శాతం తగ్గింపుతో ఇల్లు కొనుక్కోవచ్చా? అంటే కోటి రూపాయల ఇంటిని 70 లక్షలకు కొనుక్కోవచ్చా? అది సాధ్యమేనా? అంటే అది సాధ్యమే. ఇల్లు, ఫ్లాట్, స్థలం ఏదైనా గానీ 30 శాతం తగ్గింపుతో కొనుక్కోవచ్చు. హైదరాబాద్ లో కూడా ఈ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఒక్క హైదరాబాద్ లోనే కాదు, దేశంలో ఏ నగరంలో అయినా సరే కొత్త ఇళ్లను 10 నుంచి 30 శాతం తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. 30 శాతం తగ్గింపు అంటే కోటి రూపాయల ఇంటి మీద రూ. 30 లక్షలు తగ్గింపు కదా సామి అని మీరు అనచ్చు. కానీ ఇది నిజం. అదెలాగో మీరే చూసేయండి. కొంతమంది బ్యాంకులో లోన్ తీసుకుని ఇల్లు కడుతూ ఉంటారు. స్థలాలు కొంటూ ఉంటారు. మరి కొంతమంది లోన్ మీద ఫ్లాట్ కొనుక్కుంటారు.
వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు పెట్టి లోన్ తీసుకుంటారు. ఏదో నష్టం వచ్చో, సమస్య వచ్చో లోన్ చెల్లించలేకపోతారు. అటువంటి సమయంలో బ్యాంకులు యజమానికి సంబంధించిన స్థలాన్ని, ఇండ్లను జప్తు చేస్తాయి. వాటిని వేలం వేస్తుంటాయి. వేలంలో మీరు ఈ ఇండ్లను గానీ ఫ్లాట్స్ ని గానీ సొంతం చేసుకోవచ్చు. దేశంలో అనేక ఇళ్ళు, కమర్షియల్ స్పేస్ లు, వ్యాపారాలకు సంబంధించి గోడౌన్ లు ఇలా చాలా వరకూ వేలంలో పెడుతుంటారు. బ్యాంకులే కాదు ఫైనాన్స్ కంపెనీలు కూడా వేలంలో పెడుతుంటాయి. తాము ఇచ్చిన లోన్ ని రికవరీ చేయడం కోసం ఆక్షన్ లో పెడతాయి. వాహనాలను కూడా ఆక్షన్ లో పెడుతుంటాయి. వీటిని పలు ఆక్షన్ వెబ్ సైట్స్ లో పెడుతుంటాయి. హైదరాబాద్ లో కూడా చాలా ఇళ్ళు, ఫ్లాట్లను పలు బ్యాంకులు వేలంలో పెట్టాయి.
ఈ వేలంలో ఉన్న ఇండ్లను మీరు కొనుగోలు చేసుకోవచ్చు. కొనుగోలు చేయడానికి ముందు బ్యాంకు నిర్ణయించిన ధరలో 10 నుంచి 15 శాతం అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అయితే వేలంలో వేసిన ఆస్తులను కొనడం వల్ల కొన్ని రిస్కులు ఉన్నాయి. కొనే ముందు టైటిల్ చెక్, ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ షిప్ స్టేటస్ ని వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే బ్యాంకులు యజమానులు కాదు. ఏదైనా సమస్య వస్తే బ్యాంకులు బాధ్యత వహించవు.
బ్యాంకు వేలంలో ఇల్లు కొనడం కోసం కొంత అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత మిగతా డబ్బు కట్టకపోతే డిపాజిట్ అనేది తిరిగి ఇవ్వరు. అలానే ఎవరైతే ఆక్షన్ లో ప్రాపర్టీని కొన్నారో వారు.. దానికి సంబంధించిన మున్సిపల్ పన్నులు, సొసైటీ ఛార్జీలు, చట్టబద్ధమైన బకాయిలు, విద్యుత్ బిల్లులు వంటివి చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత వేలంలో ఇల్లు కొంటే ప్రయోజనం అనేది ఉంటుంది. ఉదాహరణకు రూ. 50 లక్షల ఇంటిని వేలంలో పెడితే దాని మీద 30 శాతం తగ్గింపు అంటే 15 లక్షలు తగ్గుతుంది. అంటే రూ. 50 లక్షల ఇల్లు రూ. 35 లక్షలకే వస్తుందన్నమాట.