పెట్రోల్ ధరలు పెరిగిపోతుండడంతో అందరి దృష్టి మైలేజ్ పైనే ఉంటుంది. అధిక మైలేజ్ ఇచ్చే బైకులు, స్కూటీలనే కొనుగోలు చేయాలని చూస్తారు. అలాంటి వారి కోసమే ఈ అధిక మైలేజ్ ఇచ్చే బైకులు, స్కూటీల జాబితా.
పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పోనీ ఎలక్ట్రిక్ వాహనాలు కొందామంటే వాటి ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఎలాగోలా కొందామనుకున్నా రేంజ్ సామాన్యుడు తట్టుకునే బడ్జెట్ లో రేంజ్ అనేది రావడం లేదు. మరోవైపు ఎలక్ట్రిక్ బైక్ లు పేలిపోతుండడంతో వాటి వైపు చూడాలంటేనే భయపడిపోతున్నారు. కొంటే పెట్రోల్ బండి కొనాలి, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలి అని అనుకుంటున్నారు. మీరు కూడా ఈ జాబితాలో ఉంటే కనుక మీ కోసమే ఈ కథనం. మంచి మైలేజ్ ఇచ్చే బైకులతో పాటు సౌకర్యంగా ఉండే స్కూటీల్లో కూడా మైలేజ్ ఇచ్చేవి ఉన్నాయి. ఇవన్నీ లక్ష రూపాయల లోపు బడ్జెట్ లోపు ఉన్నవే. ఎక్స్ షోరూం ధరలు, అలానే ఆర్టీవో, ఇన్సూరెన్స్ తో కలిపి ఆన్ రోడ్ ధరలు ఇవ్వబడినవి. మరి లక్ష లోపు బడ్జెట్ లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు, స్కూటీల గురించి వివరాలు మీ కోసం.