హైదరాబాద్ లో ఇల్లు కొనాలన్నా, స్థలం కొనాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా ఈ ఏరియాల్లో అయితే బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా, రెంటల్స్ పరంగా మంచి లాభాలు ఉంటాయి. కానీ పొరపాటున కూడా కొన్ని ఏరియాల్లో ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళద్దు. ఎందుకంటే తీవ్రంగా నష్టపోతారు.
హైదరాబాద్ లాంటి మహా నగరంలో స్థలం గానీ, ఇల్లు గానీ, ఫ్లాట్ గానీ కొనాలంటే ఎక్కడ కొనాలో అనేది అర్థం కాదు. ఒక్కో ఏరియాకి ఒక్కో ప్రత్యేకత అనేది ఉంటుంది. పెరుగుదల వృద్ధి అనేది ఒక్కో ఏరియాకు ఒక్కోలా ఉంటుంది. ప్రతీ ఏరియాకు పాజిటివ్స్, అలానే నెగిటివ్స్ కూడా ఉంటాయి. అన్ని ఏరియాలు అన్నిటిలో స్ట్రాంగ్ గా ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఏరియాలో ప్లాట్ కొంటే మంచిది? ఎక్కడ ఫ్లాట్ కొంటే మంచిది. ఏ ఏరియాలో ఇల్లు కడితే రెంట్లు ఎక్కువ వస్తాయి? ఏ ఏరియాలో మార్కెట్ ట్రెండ్ అనేది బాగుంది? పెట్టుబడి అనేది ఏ ఏరియాలో పెడితే లాభాలు వస్తాయి? ఏ ఏరియాలు టాప్ పెర్ఫార్మర్స్ గా ఉన్నాయి? ఈ ఏడాది ఏ ఏరియాలు ట్రెండ్ లో ఉన్నాయి? అనే విషయాలు మీ కోసం.
ఇల్లు కొనాలనుకున్నా, స్థలం కొనాలనుకున్నా గానీ మీరు రియల్ ఎస్టేట్ లో మార్కెట్ ట్రెండ్స్ ని, డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీ కోసం హైదరాబాద్ లో ట్రెండింగ్ లో ఉన్న ఏరియాలను పరిచయం చేస్తున్నాం. ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్వహించిన సర్వే ప్రకారం.. 54 శాతం మంది కొనుగోలుదారులు హైదరాబాద్ లో కొత్త ఇంటిని కొనడానికి, కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. అవి మణికొండ, కూకట్ పల్లి, అమీర్ పేట్, హఫీజ్ పేట్, బంజారాహిల్స్ ఏరియాలు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏరియాల్లో ఇల్లు కొనడానికి, కొత్త ఇంట్లో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య అనేది పెరిగింది.
మణికొండ ఏరియా వాణిజ్య కేంద్రం కావడం వల్ల ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం చాలా మంచిదని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం పెద్ద పెద్ద కార్యాలయాలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక సిటీకి సెంటర్ లో ఉండడం కంటే నగర శివారు ప్రాంతాలైన కూకట్ పల్లి, హఫీజ్ పేట్ ఏరియాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. మంచి ధరల్లో విశాలంగా పెద్ద ఇళ్ళు కట్టుకోవడానికి ఆసక్తి చూపే వారి సంఖ్య కూడా పెరిగింది. ప్రశాంతంగా ఉండడం కోసం రెసిడెన్షియల్ ఏరియాగా అమీర్ పేట్ ని ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు.
హైదరాబాద్ లోని ఫ్లాట్స్ కొనడానికి ఆసక్తి చూపుతున్న ఏరియాల్లో మాదాపూర్, మణికొండ, ఎల్బీనగర్ ఏరియాలు టాప్ లో ఉన్నాయి. మంచి బిజినెస్ ఏరియాలుగా ఉండడం.. బయ్యర్లకు కమర్షియల్ స్పేస్, రెసిడెన్షియల్ స్పేస్ ఆప్షన్స్ ని పుష్కలంగా ఇవ్వడం వంటి కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో ఫ్లాట్స్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కూకట్ పల్లి, బోడుప్పల్ ప్రాంతాలు కూడా వాటి కనెక్టివిటీ కారణంగా, అందుబాటులో ఉన్న వ్యాపార అవకాశాల కారణంగా పెరుగుదల అనేది కనబడుతోంది. ఈ ఏరియాలు రాబోయే ఏడాదిలో కూడా ఇదే ట్రెండ్ ని కొనసాగిస్తాయని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఈ ఏరియాల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో స్థిరమైన పెట్టుబడి పెట్టేందుకు 2023 అనేది తగిన సమయం అని చెబుతున్నారు.
హైదరాబాద్ లోని నిజాంపేట్, అత్తాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మియాపూర్, మీర్ పేట్ ఏరియాల్లో స్థలం మీద గానీ, ఫ్లాట్ మీద గానీ, ఇంటి మీద గానీ పెట్టుబడి పెడితే తీవ్రంగా నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏరియాల్లో ఏ మాత్రం మార్కెట్ ట్రెండ్ అనేది బాగా లేదంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే వృద్ధి రేటు అనేది చాలా వరస్ట్ గా ఉందని అంటున్నారు. ఈ ఏరియాల్లో బయ్యర్లు ఆసక్తి చూపించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది.. ఇల్లు ఎలా ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి అనే అంశాలను 2023వ సంవత్సరం పూర్తిగా మార్చేసింది. అందుకే చాలా మంది ఈ ఏరియాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు.
అద్దెకు ఉండేవాళ్ళు ఎక్కడ ఉండాలో అనే దాని మీద చాలా స్పష్టంగా ఉన్నారు. బిజినెస్ మరియు వాణిజ్య సంస్థలకు కనెక్టివిటీని ఆఫర్ చేసే బిజినెస్ డిస్ట్రిక్ట్స్ మరియు ప్రాంతాల్లో ఉండేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.
కాబట్టి పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే గనుక.. మణికొండ, కూకట్ పల్లి, అమీర్ పేట్, బంజారాహిల్స్, హఫీజ్ పేట్ ఏరియాల్లో స్థలాల మీద పెడితే మంచిది. ఎందుకంటే ఈ ఏరియాల్లో ఎక్కువ మంది ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే వృద్ధి రేటు కూడా పెరిగింది. ఇక ఫ్లాట్ కొనాలి అనుకుంటే గనుక.. కూకట్ పల్లి, మాదాపూర్, మణికొండ, ఎల్బీ నగర్, బోడుప్పల్ ప్రాంతాలు మంచివి. ఫ్లాట్ కొని లేదా ఇల్లు కట్టి అద్దెకు ఇవ్వాలి అనుకుంటే గనుక కూకట్ పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ, మాదాపూర్ ఏరియాలు మంచివి. ఈ ఏరియాల్లో ఎక్కువ మంది రెంట్లకు ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువ రెంట్లు వస్తాయి. ఈ ఏడాది అయితే ఈ ఏరియాలు పెట్టుబడులకు మంచి లాభసాటిగా ఉన్నాయి. కానీ మీర్ పేట్, మియాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అత్తాపూర్, నిజాంపేట్ ఏరియాలు మాత్రం ఇన్వెస్ట్మెంట్ కి ప్రతికూలమని చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఒక అవగాహన కోసం చెప్పడం జరిగింది. పూర్తి అవగాహన కోసం స్థానిక రియల్ ఎస్టేట్ నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.