డిజిటల్ పేమెంట్స్ రాకతో అన్ని రకాల బ్యాంకింగ్ లావాదేవీలు స్మార్ట్ ఫోన్ లోనే జరిగిపోతున్నాయి. పేమెంట్లు చేయాలన్నా, మనీ ఇంకొకరికి పంపాలన్నా క్షణాల్లో పంపేస్తున్నాం.. అయినప్పటికీ కొన్ని పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లడం తప్పనిసరి. ఇక వ్యాపారస్తులయితే ప్రతిరోజూ బ్యాంకులను సందర్శిస్తున్నారు. డీడీ కావాలనో.. భారీ మొత్తంలో నగదు చెలామణి చేయాలనో.. ఇలా ఏదో ఒక అవసరం బ్యాంకుకు రప్పిస్తుంది. అలాంటి వారు తప్పనిసరిగా బ్యాంకు పనిదినాల గురుంచి తెలుసుకోవాల్సిందే.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ).. ఫిబ్రవరి నెలలో బ్యాంకుల సెలవు దినాలు వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం వచ్చే నెలలో 10 రోజులు బ్యాంకులు పని చేయవు. శని, ఆదివారాలు కాకుండా.. మహాశివరాత్రి వంటి పర్వదినాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ సెలవు దినాలు రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా మారుతుంటాయి. నేషనల్ బ్యాంక్ హాలీడేస్ మాత్రం దేశవ్యాప్తంగా అమలవుతాయి.