హిందూ సంప్రదాయంలో అరటి ఆకులకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే గ్రామాల్లో దొరికినంత ఈజీగా పట్టణాల్లో అరటి ఆకులు దొరకవు. నగర వాసులు పండగలు, పబ్బాలు వస్తే వీటి కోసం మార్కెట్ల వద్ద బారులు తీరాల్సి వస్తుంది. దీంతో ఆన్‌లైన్ వ్యాపారులు అరటి ఆకులను ఇంటికే డెలవరీ చేస్తామంటూ ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పల్లెల్లో అయితే ఫ్రీగా దొరికే వీటి ధర ఆన్‌లైన్‌లో ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆహారం ఎండిపోకుండా, అంటుకోకుండా మరియు వేడి చల్లారకుండా ఉపయోగించే ఒక ప్లాస్టిక్ రేపర్ లాగా,పార్చ్మెంట్ కాగితంలాగా, అల్యూమినియం ఫాయిల్ లాగా, ఈ అరటి ఆకును ఆహార రేపర్ లాగా ఉపయోగించుకోవొచ్చు. కస్టమర్ దేవుళ్లే తమకు కాసులు కురిపిస్తారని భావించిన వ్యాపారులు అరటి ఆకులను కూడా ఆన్‌లైన్‌లో పెట్టి బిజినెస్ చేసేస్తున్నారు. శ్రావణమాసం ఇళ్లలో పూజలు, వ్రతాలు, నోములు సందర్భం ఏదైనా అరటి ఆకులో భోజనం చేస్తే అదో తృప్తి ఎక్కడ దొరుకుతాయో ఎంక్వైరీ చేయడం ఎందుకు. ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయి.
అన్నీ ఆన్‌లైన్‌లో దొరికేస్తున్నాయి. ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు. ధర ఎంతైనా ఫరవాలేదు. దొరికితే అంతే చాలనుకుంటున్నారు. అరటి ఆకులో వడ్డించిన ఆహారం ఆరోగ్యకరమైనదిగా గుర్తించారు. అరటి ఆకులో వేడి ఆహారం వడ్డించటం వలన ఆకులో ఉన్నముఖ్యమైన పోషకాలు ప్రసరిస్తాయి… ఆహారంలో కలుస్తాయి. శుభ కార్యక్రమాలకు గుమ్మాల ముందు అరటి చెట్లను కడతారు. ఈ అరటి ఆకులో క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటే బూడిద జుట్టుతో ఉన్నవారు నల్లనిజుట్టును పొందుతారు. శరీరంపైన కాలిన బొబ్బలమీద అల్లం నూనె వేసి దాని పైన అరటిఆకుతో మూసి, కాలినబొబ్బలను తగ్గిస్తుంది.
ఐదు అరిటాకులు ధర రూ. 50 లు అంటూ బిగ్ బాస్కెట్ అనే అస్‌లైన్ కార్పొరేట్ వ్యాపార సంస్థ తమ సైట్‌లో ఆఫర్ ప్రకటించింది . ఐదు ఆకుల అసలు ధర రూ. 62.50 అయితే, 20 శాతం డిస్కౌంట్ పోనూ రూ. 50కి ఇస్తున్నామని సదరు సంస్థ ప్రకటించింది. అసలే శ్రావణ మాసం పూజలు, ఫంక్షన్ల కాలం. దీంతో అరిటాకులకు ఆన్ లైన్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.