ఐకమత్యమే మహాబలం అంటారు. విడి విడిగా ఉండి సాధించలేని పనిని.. కలిసికట్టుగా ఉండి సాధించవచ్చని పెద్దలు చెబుతుంటారు. మనుషుల్లో ఈ లక్షణం పెద్దగా కనిపించదు.. కానీ జంతువులు, పక్షుల్లో మాత్రం ఈ గుణం మెండుగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాకుల్లో ఐకమత్యం పాళ్లు కాస్త ఎక్కువే. ఒక్క కాకికి సమస్య వచ్చిందంటే చాలు.. కావ్ కావ్‌మంటూ మిగతా కాకులు.. దానికి మద్దతుగా వచ్చేస్తాయి. ప్రస్తుత కాంక్రీట్ కీకారణ్యాలలో కాకులు కూడా కనుమరుగువుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వీటిని చూసి మనం చాలా నేర్చుకోవాలి అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ఖాతాలో ఏదైనా పోస్ట్ వచ్చిందంటే చాలు.. నిమిషాల్లో జనాలు దాన్ని వైరల్ చేస్తుంటారు. ఎందుకంటే ఆయన ఎక్కువగా మనలో స్ఫూర్తి నింపే అంశాల గురించి.. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న వారి గురించి పోస్ట్ చేయడమే కాక.. అలాంటి ప్రతిభావంతులుకు తనకు తోచిన మేర సాయం చేస్తారు. ఈ క్రమంలో తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ స్ఫూర్తిదాయక వీడియోని షేర్ చేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే దాని గురించి వివరాలు లేవు.
ఇది కూడా చదవండి: ఆనంద్ మహీంద్రాను ఫిదా చేసిన ఉడెన్ ట్రెడ్‌మిల్.. ఒకటి పంపాలంటూ రిక్వెస్ట్!ఇక వీడియోలో ఉన్నదాని ప్రకారం ఓ చోట రోడ్డు మీద పిల్లి ఆహారాన్ని తింటూ ఉంటుంది. దాన్ని రెండు కాకులు గమనిస్తాయి. ఎలా అయినా సరే పిల్లి దగ్గర ఉన్న ఆహారం కొట్టేయాలని భావిస్తాయి. అందుకు రెండు కాకులు కలిసి మాస్టర్ ప్లాన్ వేస్తాయి. దానిలో భాగంగా ఓ కాకి వెళ్లి.. రోడ్డు మీద తనకు దొరికిన ఆహారాన్ని తింటున్న పిల్లి వెనకు వెళ్లి.. దాన్ని తన ముక్కుతో పొడుస్తోంది. కాకి చేష్టలతో ఆగ్రహానికి గురైన పిల్లి.. దాన్ని పట్టుకోవడానికి.. తింటున్న ఆహారాన్ని వదిలి.. దాని వెంబడి పరుగుతీస్తుంది.
ఇది కూడా చదవండి: వైరల్ వీడియో: సైకిల్‌ను.. బైక్‌గా మార్చారు! ఆనంద్ మహీంద్రా ప్రశంసలు!
ఇదే అదునుగా భావించిన రెండో కాకి.. అక్కడకు వచ్చి.. పిల్లి వదిలేసి వెళ్లిన ఆహారాన్ని నోట కర్చుకుని.. దూరంగా పారిపోతుంది. అలా కాకులు తమ స్మార్ట్ బుర్రను ఉపయోగించి.. ఒకే మాట మీద నిలబడి.. పిల్లిని బకరాని చేస్తాయి. ఈ వీడియోని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ‘‘మీరు కూడా బృందంగా ఏర్పడి.. కలిసికట్టుగా పని చేస్తే.. మెరుగైన ఫలితాలు సాధించవచ్చు’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. కాకుల తెలివిని ప్రశంసిస్తున్నారు నెటిజనులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Remember…you’re always going to be more effective if you work collaboratively with a team.. 😊 #MondayMorning pic.twitter.com/lsKKKuJbcc
— anand mahindra (@anandmahindra) March 28, 2022
ఇది కూడా చదవండి: రైలు పట్టాలపై బాలిక! ప్రాణాలకి తెగించి కాపాడిన యువకుడు!