పెంపుడు జంతువుల మీద ప్రేమ ఉండటం సర్వ సాధారణం. ముఖ్యంగా సెలెబ్రిటీ తమ పెంపుడు జంతువులను ప్రాణంగా చూసుకుంటారు. వాటికి ఏమైనా అయితే తట్టుకోలేరు. తమ ప్రాణం పోయినట్లుగా గిలగిల్లాడిపోతారు.
ఇటీవల అడవులను పెద్ద ఎత్తున నరికి వేయడంతో అక్కడ ఉండే కృరమృగాలు పట్టణాలు, గ్రామాల్లోకి రావడం చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో గ్రామాల్లో వ్యవసాయ బావుల్లో కొన్ని కృరమృగాలు ప్రమాదవశాత్తు పడిపోతున్నాయి.
సార్.. మా పక్కింటతను నన్ను కొట్టాడు, సార్.. నా మెడలో బంగారం లాక్కెళ్లారు, సార్.. పార్కింగ్‌లో ఉన్న నా కార్ పోయింది.. ఇలాంటి కేసులు పోలీసు స్టేషన్ల వరకు డజన్ల కొద్దీ వస్తుంటాయి. కానీ, ఈ కేసు విభిన్నం. పిల్లి పోయిందంటూ ఓ వ్యక్తి కంప్లెట్ ఇచ్చాడు. సార్ నేను ఎంతో ఇష్టంగా.. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న పిల్లిని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తికెళ్లిపోయాడు.. మీరే నాకు న్యాయం చేయాలంటూ మహమ్మద్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. […]
అవును మీరు చదివింది నిజమే.. ఓ పిల్లి ఆస్తి విలువ అక్షరాలా 800 కోట్ల రూపాయలు. ఇంత ఆస్తి ఉంది కదా ఈ పిల్లి ఏమైనా స్వర్గంనుంచి దిగివచ్చిందా? అన్న వ్యంగ్య ప్రశ్న తలెత్తక మానదు. ఈ పిల్లి మిగితా పిల్లుల కంటే ప్రత్యేకమైనదేమీ కాదు. కానీ, దాన్ని పెంచుకునే ఓనర్ గొప్పతనం కారణంగా ఈ పిల్లికి మహర్థశ పట్టింది. ఆనతి కాలంలో అంత పెద్ద మొత్తం డబ్బు సంపాదించింది. ఇప్పటికి కూడా సంపాదిస్తూనే ఉంది. ఆ […]
England: గుండెపోటుతో ప్రాణాల కోసం పోరాడుతున్న తన యజమానిని ఓ పిల్లి రక్షించింది. సీపీఆర్ చేసి మరీ యజమానిని కాపాడుకుంది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో ఆసల్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హామ్‌కు చెందిన 42 ఏళ్ల సామ్ ఫెల్‌స్టీడ్ కొన్ని కుక్కలతో పాటు బిల్లీ అనే ఓ పిల్లిని కూడా పెంచుకుంటోంది. కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి రోజూలానే సామ్ నిద్రపోయింది. తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో నిద్రలోనే ఆమె గుండెల్లో నొప్పి మొదలైంది. […]
Woman Marries Cat: ‘‘మేకను పెళ్లి చేసుకున్న యువకుడు’’.. ‘‘ చెట్టును వివాహం చేసుకున్న హీరోయిన్’’ అన్న వార్తలు చదివే ఉంటారు. దేశంలో ఇలాంటి పెళ్లిళ్లు కొత్తేమీ కాదు.. వింతేమీ కాదు. సాధారణంగా జాతకంలో ఏదైనా దోషం ఉండి.. పెళ్లి జరగటం లేదంటే ఇలా చేస్తూ ఉంటారు. దోషం ఉన్నవాళ్లకు చెట్టుతోనో.. లేదా ఏదైనా జంతువుతోనో పెళ్లి చేస్తారు. ఆ పెళ్లితో దోషం తీరిపోయిందని భావిస్తారు. ఆ తర్వాత నిజమైన పెళ్లి చేస్తారు. అత్యవసరం అనుకుంటే తప్ప […]
ఐకమత్యమే మహాబలం అంటారు. విడి విడిగా ఉండి సాధించలేని పనిని.. కలిసికట్టుగా ఉండి సాధించవచ్చని పెద్దలు చెబుతుంటారు. మనుషుల్లో ఈ లక్షణం పెద్దగా కనిపించదు.. కానీ జంతువులు, పక్షుల్లో మాత్రం ఈ గుణం మెండుగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాకుల్లో ఐకమత్యం పాళ్లు కాస్త ఎక్కువే. ఒక్క కాకికి సమస్య వచ్చిందంటే చాలు.. కావ్ కావ్‌మంటూ మిగతా కాకులు.. దానికి మద్దతుగా వచ్చేస్తాయి. ప్రస్తుత కాంక్రీట్ కీకారణ్యాలలో కాకులు కూడా కనుమరుగువుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ […]
Cat : పిల్లి, పత్తి కథ విన్న వారికి దాని వల్ల కలిగే నష్టం ఏంటో తెలిసే ఉంటుంది. అది ఒక ఇంట్లో పత్తి కాబట్టి పెంచుకున్న వాడు నష్టపోతాడు. కానీ, ఈ కథలో అలా జరగలేదు. పిల్లి చేసిన పనికి వేల సంఖ్యలో చిరు వ్యాపారులు నష్టపోయారు. కోటో రెండు కోట్లో కాదు.. ఏకంగా వంద కోట్లు. వంద కోట్లా.. అంత పని ఏమి చేసింది? అని అనుకుంటున్నారా? తెలుసుకోవాలనుకుంటే మొత్తం చదివేసేయండి. వివరాల్లోకి వెళితే.. […]
సాధారణంగా కుక్కలకు కొతి అన్నా.. పిల్లి అన్నా మా చెడ్డ చిరాకు. అవి కనిపిస్తే చాలు వెంటపడి మరీ ఉరికిస్తాయి. ముఖ్యంగా కుక్క-పిల్లి వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. టామ్ అండ్ జర్రీ లాగే కొట్లాడుకుంటాయి. అలాంటిది పిల్లికి కుక్క పాలు ఇవ్వడమే కాదు.. కలిసి మెలిసి ఆడుకోవడం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని రాయిపేట గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ మద్య మానవత్వపు విలువలు మరచి […]
పెద్ద పెద్ద విపత్తులు సంభవించినప్పుడు, అసాధారణ సంఘటనలు జరిగినప్పుడు ఈ జనాలకు హఠాత్తుగా పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి గుర్తొస్తారు. ఫ్రెంచి కాలజ్ఞానిగా ప్రాచుర్యం పొందిన నోస్ట్రడామస్ గుర్తొస్తారు. పాపం నాలుగైదు శతాబ్దాల కిందే చచ్చిపోయిన వారికి అర్జంటుగా ప్రాణప్రతిష్ట చేస్తారు. వీర బ్రహ్మంగారు చెప్పిన కాల జ్ఞానం లో ఇప్పటివరకు ఎన్నో విషయాలు నిజంగా జరిగాయి చూసారా … అని కొందరు చెప్పేస్తారు. నిజమని వీడియోలు కూడా చూపిస్తారు. జరుగుతూనే ఉన్నాయి. అది నిజం అని మనం […]