సాధారణంగా కుక్కలకు కొతి అన్నా.. పిల్లి అన్నా మా చెడ్డ చిరాకు. అవి కనిపిస్తే చాలు వెంటపడి మరీ ఉరికిస్తాయి. ముఖ్యంగా కుక్క-పిల్లి వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. టామ్ అండ్ జర్రీ లాగే కొట్లాడుకుంటాయి. అలాంటిది పిల్లికి కుక్క పాలు ఇవ్వడమే కాదు.. కలిసి మెలిసి ఆడుకోవడం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని రాయిపేట గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన.
ఈ మద్య మానవత్వపు విలువలు మరచి మనిషి ఎంతటి దారుణాలకు తెగబడుతున్నాడో ప్రత్యేకంగా తెలియదు. జాతి, కుల, మతాల వివాదంలో ప్రతి రోజూ ఎక్కడో అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎదుటి వారు ఎన్ని కష్టాల్లో ఉన్నా.. మాకు ఎందుకు అంటూ పక్కకు తప్పుకుని పోయే ఈ కాలంలో.. మానవత్వపు పరిమళాలలు పూయిస్తోంది కుక్క, పిల్లి స్నేహం. జాతివైరాన్ని మరిచి ఈ రెండు జంతువులు అన్యోన్యంగా ఉండటమే కాదు.. ఆత్మీయతను చాటుకుంటున్నాయి.మంచిర్యాల జిల్లా రాయిపేట గ్రామంలో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక్కడ గత కొన్ని రోజులుగా కుక్క,పిల్లి ఎంతో స్నేహంగా కలిసి మెలిసి తిరుగుతున్నాయి. అంతేకాదు వారం రోజులుగా పిల్లి.. శునకం పాలు తాగుతూ దానితోనే ఆడుకుంటోంది. జాతి వైరాలు సాన్నిహిత్యంగా మెదులుతున్న ఈ రెండింటి తీరు చూసి స్థానికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కుక్క, పిల్లి మద్య గొడవలు పోయి.. ప్రేమా అనురాగాలు చిగురించిన తీరుగా ఈ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.