పెంపుడు జంతువుల మీద ప్రేమ ఉండటం సర్వ సాధారణం. ముఖ్యంగా సెలెబ్రిటీ తమ పెంపుడు జంతువులను ప్రాణంగా చూసుకుంటారు. వాటికి ఏమైనా అయితే తట్టుకోలేరు. తమ ప్రాణం పోయినట్లుగా గిలగిల్లాడిపోతారు.
సినిమా వాళ్లకు పెంపుడు జంతువులంటే ప్రాణం. ఇంట్లో మనుషులు లేకపోయినా సంతోషంగా ఉండగలుగుతారేమో కానీ, తాము ఎంతో ఇష్టంగా పెంచుకునే జంతువులు పోతే మాత్రం తట్టుకోలేరు. విలవిల్లాడిపోతారు. సదరు పెంపుడు జంతువులు చనిపోయినపుడు ఒకలాంటి బాధ ఉంటే.. అవి తప్పిపోయినపుడు ఇంకోలాంటి బాధ ఉంటుంది. అవి ఎక్కడికైనా వెళ్లిపోయాయా? లేక ఎవరైనా ఎత్తుకెళ్లారా? ఎత్తుకెళితే అవి క్షేమంగానే ఉన్నాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు వారి మెదడును పట్టి పీడిస్తుంటాయి. ఆ బాధ వర్ణణాతీయం. ప్రస్తుతం ప్రముఖ నటి దీపికా దాస్ ఇదే బాధను అనుభవిస్తున్నారు. ఆమె ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పిల్లి కనిపించకుండా పోయేసరికి అల్లాడిపోతున్నారు.
తన పిల్లిని వెతికి పెట్టమంటూ తన ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తన పిల్లిని తెచ్చి ఇస్తే.. 10 నుంచి 15 వేల రూపాయలు ఇస్తానని అన్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బుధవారం ఓ పోస్టును పెట్టారు. ఆ పోస్టులో ఈ విధంగా ఉంది. ‘‘కనిపించుట లేదు. 18వ తేదీ శనివారం రాత్రి నుంచి నా పిల్లి కనిపించటం లేదు. బెంగళూరులోని విశ్వేశ్వరయ్య లేఅవుట్‌లోని బ్లాక్ నెంబర్ 3నుంచి ఎక్కడికో వెళ్లిపోయింది. దాని పేరు క్యాడు. అది పర్సియన్ జాతికి చెందినది. దాని వయసు 9 సంవత్సరాలు. దాన్ని వెతికి తెచ్చిన వారికి 10 వేల రూపాయల నుంచి 15 వేల రూపాయలు ఇస్తాను. సంప్రదించవల్సిన నెంబర్లు… దయచేసి ఈ పిల్లి ఎవరైకా కనిపిస్తే పైన తెలిపిన నెంబర్లకు ఫోన్ చేయండి’’ అని ఉంది.
ప్రస్తుతం దీపికా దాస్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె బాధను చూసి చలిస్తున్న వారు కొందరైతే.. మరికొందరు కామెంట్ల రూపంలో కామెడీ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు.. ‘‘ నా దగ్గర ఓ తెల్ల పిల్లి ఉంది. నేను దాన్ని మీకు ఇస్తాను. నాకు 5 వేలు ఇవ్వండి. నాకు మందు తాగడానికి డబ్బుల్లేవు. ప్లీజ్’’.. ‘‘ ఇంట్లో సభ్యుల్లాగా చూసుకునే జంతువులు కనిపించకుండాపోతే చాలా బాధగా ఉంటుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, దీపికా దాస్ పెట్టిన పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.