సార్.. మా పక్కింటతను నన్ను కొట్టాడు, సార్.. నా మెడలో బంగారం లాక్కెళ్లారు, సార్.. పార్కింగ్‌లో ఉన్న నా కార్ పోయింది.. ఇలాంటి కేసులు పోలీసు స్టేషన్ల వరకు డజన్ల కొద్దీ వస్తుంటాయి. కానీ, ఈ కేసు విభిన్నం. పిల్లి పోయిందంటూ ఓ వ్యక్తి కంప్లెట్ ఇచ్చాడు. సార్ నేను ఎంతో ఇష్టంగా.. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న పిల్లిని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తికెళ్లిపోయాడు.. మీరే నాకు న్యాయం చేయాలంటూ మహమ్మద్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో చోటుచేసుకుంది.
పిల్లిని ఎత్తికెళ్లారని బాధితుడు కంప్లైంట్ ఇవ్వగా, వాడు జంతు ప్రేమికుడు ఏమోలే ఇంకొకటి తీసుకో అని పోలీసులు చెపుదామనుకున్నారు. కానీ, బాధిత వ్యక్తి పిల్లి ప్రత్యేకతలు చెప్పడంతో ఆశ్చర్యపోవడం వారి వంతయ్యింది. ఈ పిల్లి నిజంగానే అరుదైనది. ఇది హౌ మనీ(Khow Manee) రకానికి చెందిన పిల్లి. ఒక కన్ను బ్లూ కల్లర్ లో.. మరో కన్ను గ్రీన్ కల్లర్ లో ఉండటం దీని ప్రత్యేకత. సుమారు రూ. 50 వేల ఖరీదు ఉంటుందట. ఈ పిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. శనివారం రాత్రి 9 గంటలు సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ వ్యక్తి ఆడుకుంటున్న పిల్లిని బైక్ పై తీసుకెళ్లినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపించాయి.
సీసీ కెమెరా దృశ్యాలను బట్టి.. బైక్ పై దర్జాగా బైక్‌పై వచ్చి ఓ ఇంటి ముందు చక్కగా ఆడుకుంటున్న పిల్లిని అలా లటుక్కున పట్టుకొని చంకాలో పెట్టుకొని వెళ్లిపోయాడు. ఎంతకీ పిల్లి లోపలికి రాకపోవడంతో అనుమానమొచ్చిన పిల్లి యజమాని మహమూద్ సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించగా ఎత్తుకెళ్లిన విషయం తెలిసింది. నిందితుడ్ని గుర్తించి నా పిల్లిని నాకు మరల తెచ్చిపెడతారని ఆశిస్తున్నానంటూ మహమ్మద్ పోలీసులతో తన బాధను వెల్లబుచ్చుకున్నాడు. చూడాలి మరీ పోలీసులు పిల్లిని వెతికి పెడతారో లేదో.. ఈ ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.