England: గుండెపోటుతో ప్రాణాల కోసం పోరాడుతున్న తన యజమానిని ఓ పిల్లి రక్షించింది. సీపీఆర్ చేసి మరీ యజమానిని కాపాడుకుంది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో ఆసల్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హామ్‌కు చెందిన 42 ఏళ్ల సామ్ ఫెల్‌స్టీడ్ కొన్ని కుక్కలతో పాటు బిల్లీ అనే ఓ పిల్లిని కూడా పెంచుకుంటోంది. కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి రోజూలానే సామ్ నిద్రపోయింది. తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో నిద్రలోనే ఆమె గుండెల్లో నొప్పి మొదలైంది. పక్కకు కదల్లేని పరిస్థితిలో నొప్పితో అల్లాడిపోసాగింది. ఈ నేపథ్యంలో బిల్లీ ఆమెను గమనించింది. వెంటనే సామ్ దగ్గరకు వెళ్లింది. ఆమె గుండెలపై తన పంజాలతో కొట్టసాగింది. యజమాని చెవుల దగ్గర గట్టిగా అరవసాగింది. కొద్దిసేపటి తర్వాత సామ్ మామూలు మనిషైంది
ఆమె ఒళ్లంతా చెమటలు పట్టాయి. చిన్నగా ఒణకసాగింది. లేచి లేవంగానే ఆమె గుండెలపై బిల్లీ ఉంది. బిల్లీ కారణంగానే తన ప్రాణాలు నిలిచాయని సామ్‌కు అర్థమైంది. ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. నాటింగ్ హామ్ సిటీ హాస్పిటల్లో చేరింది. సామ్‌కు తోడుగా ఆమె తల్లి ఆసుపత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు నిద్రలో గుండెపోటు వచ్చినట్లు తేల్చారు. ఇక దీనిపై సామ్ మాట్లాడుతూ.. ‘‘ సంఘటన జరిగిన సమయంలో బిల్లీ నా గుండెల మీద ఉంది. గట్టిగా నా చెవుల దగ్గర మియావ్‌వ్‌వ్‌వ్ అని అరుస్తూ ఉంది. సాధారణంగా అది అలా చేయదు. అది ఎప్పుడూ నిద్రపోతూ ఉంటుంది. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా నిద్రపోతుంటుంది. అదే దాని జీవితం.
కానీ, నన్ను మాత్రం వదిలిపెట్టదు. అది నన్ను ఎప్పుడూ రాత్రిళ్లు నిద్రలేపలేదు. తిండి కోసం కూడా నిద్రలేపలేదు. అది నేను చెప్పగానే మా అమ్మ నమ్మలేకపోయింది. అది నన్ను సీపీఆర్ చేసి కాపాడిందని చెప్పగా ఆశ్చర్యానికి గురైంది. బిల్లీ లేకపోయి ఉంటే ఇప్పుడు నా పరిస్థితి దారుణంగా ఉండేది’’ అని చెప్పుకొచ్చింది. మూడు రోజులు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాక సామ్ ఇంటికి వెళ్లింది. అప్పుడు బిల్లీ ఆమె గురించి పట్టించుకోలేదు. ఎప్పటిలాగే ఉంది. కానీ, ఆమె మాత్రం దాన్ని కొంచెం ప్రేమగా చూసుకుంటోంది. మరి, యజమాని ప్రాణాలు కాపాడిన పిల్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ల్యాండింగ్ చేస్తూ ఢీకొన్న రెండు విమానాలు!