అమెజాన్ ప్రైమ్ డే సేల్‌కు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 23 నుంచి 24వ తేదీ వరకు సేల్ ఉండనుంది. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికే ప్రత్యేకంగా ఈ సేల్ నిర్వహిస్తుంది అమెజాన్. అంటే ప్రైమ్ మెంబర్లకే ఈ సేల్‌లో డిస్కౌంట్లు లభించనున్నాయి. సేల్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ.. డీల్స్ వివరాలను వెల్లడిస్తోంది.. అమెజాన్. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ వాచ్‌లతో పాటు అన్ని ఎలక్ట్రానిక్స్, ప్రొడక్టులపై ఆఫర్లు ఉండనున్నాయి. అలాగే.. కొనుగోలు సమయంలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లతో 10 శాతం వరకు అదనంగా తగ్గింపు కూడా దక్కనుంది.
ప్రైమ్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై 40శాతం వరకు డిస్కౌంట్లు ఇవ్వనుంది అమెజాన్. ప్రైమ్ డే సందర్భంగా డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉంచనున్న కొన్ని మొబైల్స్‌ను తాజాగా టీజ్ చేసింది. అవేంటో చూడండి.
రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ:
రెడ్‌మీ నోట్ 11 ప్రో 5జీ.. ప్రస్తుత ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గా ఉన్నాయి. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.24,999గా ఉంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఎస్‌బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.17,249 ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఐకూ జెడ్6 ప్రో:
ఐకూ జెడ్6 ప్రో.. ప్రస్తుత ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉన్నాయి. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.28,999గా ఉంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఎస్‌బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.19,990 ధరకే సొంతం చేసుకోవచ్చు.
షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ:
షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ.. ధరలు 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999గా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఎస్‌బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.17,999 ధరకే సొంతం చేసుకోవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ:
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ.. ప్రస్తుత ధరలు 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఎస్‌బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.22,499 ధరకే సొంతం చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ:
శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ.. ప్రస్తుత ధరలు 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఎస్‌బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.22,999 ధరకే సొంతం చేసుకోవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్:
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్.. ప్రస్తుత ధర చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఎస్‌బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్‌తో రూ.17,499 ధరకే సొంతం చేసుకోవచ్చు.
రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ 5జీ:
రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ 5జీ.. ధరలు 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఎస్‌బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.15,249 ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఈ ఆఫర్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.