దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా కొనసాగుతోన్న ఎస్బీఐ తన కస్టమర్లకు షాకిచ్చింది. కేవైసీ అప్డేట్ చేసుకోకుండా నిర్లక్ష్యం వహించిన కస్టమర్ల అకౌంట్లను ఆపివేసింది. కేవైసీ అప్డేట్ పేరుతో అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో.. కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ముందస్తు నోటీసులు లేకుండా తమ అకౌంట్లు నిలిపివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మైక్రో బ్లాగింగ్ సైటు ట్విటర్లో ఎస్బీఐని ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై ఎస్బీఐ స్పందించింది.
బ్యాంకు సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు, ఆర్బీఐ నిబంధనల ప్రకారం వినియోగదారులు వారి కేవైసీని క్రమానుసారంగా అప్డేట్ చేయాలని సూచించింది. అంతేకాకుండా కేవైసీ అప్డేషన్ కు సంబంధించిన సమాచారాన్ని బ్యాంకు ఖాతాదారులకు ఎస్ఎంఎస్ లేదా ఈ మెయిల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని ఎస్బీఐ వెల్లడించింది. “కేవైసీ లేకపోవడం వల్లనే మీ అకౌంట్ క్లోజ్ అయి ఉంటుంది. మీరు బ్రాంచ్‌కి వెళ్లి, వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకుని అకౌంట్ తిరిగి యాక్టీవ్ అయ్యేలా చేసుకోండి” అని కస్టమర్ల ఫిర్యాదుకి ఎస్బీఐ ట్వీట్ చేసింది.
details or send a copy for their KYC Documents to their Branch email id through your registered mail id (if the KYC details are unchanged). Hope this clarifies your doubt. https://t.co/mSYcXr4dBD (2/2)
— State Bank of India (@TheOfficialSBI) July 2, 2022
కేవైసీ అప్డేట్ ఎలా చేయాలి?
బ్యాంకు నుంచి కేవైసీ సమాచారం అందిన వినియోగదారులు.. కేవైసీ అప్డేడేషన్ కు సంబంధించి నిర్దిష్ట ఫార్మాట్ తో కూడిన ఫారం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది నేరుగా బ్యాంక్ బ్రాంచికి వెళ్లి ఇవ్వొచ్చు లేదా బ్రాంచి ఈ మెయిల్ ఐడీకి మెయిల్ చేయొచ్చు. పోస్టల్ ద్వారా కూడా పంపించొచ్చు. ఇంతకు ముందు ఇచ్చిన కేవైసీ సమాచారానికి, ప్రస్తుతం ఉన్న కేవైసీకి ఎలాంటి మార్పులూ లేని వారు మాత్రమే ఈ- మెయిల్ ఐడీ, పోస్టల్ ద్వారా కేవైసీ సబ్మిట్ చేయవచ్చు. ఏమైనా మార్పులు ఉంటే. అటువంటి వారు నేరుగా – బ్యాంకు బ్రాంచికి వెళ్లి మాత్రమే కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇటువంటి వారు కేవైసీకి సంబందించిన అన్ని ఒరిజినల్ పత్రాలను, బ్యాంకు ఇతర డాక్యుమెంట్లు, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా వెంట తీసుకెళ్లాలి.
కేవైసీ అప్డేట్ కు అంగీకరించే పత్రాలు..
గమనిక: పై విషయాలను గూగుల్ లో లభించిన సమాచారం మేరకు అందిస్తున్నాం. పూర్తి వివరాలకు మీరు దగ్గరలోని ఎస్బీఐ బ్యాంకును సంప్రదించండి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.