బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. కంటెస్టెంట్స్ టైటిల్ కోసం నానా తిప్పలు పడి ఆడుతున్నారు. ఆదివారం రాగానే ఎవరు ఇంటి నుంచి ఎలిమినేట్ అవుతారు అనే ప్రశ్న మొదలవుతుంది. అయితే ఈవారం హౌస్‌లో షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. 17 మందితో స్టార్ట్ చేసిన సీజన్ ప్రస్తుతం 11 మంది మిగిలారు. వారానికి ఒకరు చొప్పున వెళ్లిపోయారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వారివారి అంచనాలు కూడా వాళ్లు వేసుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. అలా ఎవరి ఊహకు అందని ఎలిమినేషన్ బిగ బాస్ చేశాడని తెలుస్తోంది. అదేంటంటే మహేశ్ విట్టా ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోయాడని లీకులు వస్తున్నాయి.
ఇదీ చదవండి: KGF-2 మూవీపై అక్కినేని అఖిల్ క్రేజీ కామెంట్స్.. పోస్ట్ వైరల్!
ఈ వారం నామినేషన్స్ లో అఖిల్, బిందు మాధవి, అనిల్, నటరాజ్, మిత్రాశర్మ, మహేశ్ విట్టా, అరియానా ఉన్నారు. వీరిలో అఖిల్, బిందు మాధవి ఇప్పటికే ఓట్ల రేసులో ముందుకు దూసుకుపోయారు. గేమ్ పరంగా చూసుకుంటే మహేశ్ ఎంతో స్ట్రాంగ్ ప్లేయర్. ఇంట్లో సభ్యులను కలుపుకుపోవడంలోగానీ, వారికి హెల్ప్ చేయడంలో, టాస్కుల్లో గట్టి పోటీ ఇవ్వడంలో మహేశ్ ఎంతో ముందుంటాడు. లాస్ట్ సీజన్‌తో పోలిస్తే కోపం విషయంలో కూడా ఎంతో హుందాగా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఎందుకు మహేశ్ ను ఎలిమినేట్ చేస్తున్నారు అనేది మాత్రం అంతు చిక్కని ప్రశ్నే అవుతుంది. అస్సలు అయ్యే అవకాశం లేదని చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికే కెప్టెన్ గా ఉన్న చైతూ బయటకు పంపి పెద్ద షాకే ఇచ్చారు. దాంతో పోలిస్తే ఇది జరిగే అవకాశం ఉందని కూడా చెప్పచ్చు.
ఈ వారం ఇంకో షాక్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందేంటంటే ఇంట్ల సభ్యుల మధ్య గొడవలు పెరిగి ఎంటర్‌టైన్మెంట్ తగ్గింపోయిందని ప్రేక్షకులు భావిస్తున్నట్లు నిర్వాహకులకు తెలిసిందంట. అందుకని వారిని ఉత్సాహ పరిచేందుకు ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అదేంటంటే మోస్ట్ ఎంటర్‌టైనింగ్ పర్సన్ బాబా భాస్కర్ ను హౌస్ లోకి పంపుతున్నట్లు చెబుతున్నారు. అదే నిజం అయితే హౌస్ లో మళ్లీ హీట్ వాతావరణం పోయి నవ్వులు పూస్తాయని చెప్పచ్చు. కానీ, ఇంకా ఉన్న 5 వారాల్లో మధ్యలో బాబా భాస్కర్ ను ఎందుకు తెస్తారు అనేది కూడా ప్రశ్నే. మహేశ్ విట్టా హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.