‘బిగ్ బాస్ ఓటీటీ’ ఫుల్ జోష్ తో కొనసాగుతోంది. కాస్త బ్రేక్ పడినా మళ్లీ పట్టాలెక్కి పరుగులు పెడుతోంది. వారియర్స్ Vs ఛాలెంజర్స్ అని పేరు పెట్టిన విధంగానే ప్రతి విషయంలో వారు తెగ కొట్టేసుకుంటున్నారు. కాకపోతే తమ టీమ్ సభ్యులను బాగానే వెనకేసుకొస్తున్నా కూడా.. అవతలి వారిని మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా ఎండగట్టేస్తున్నారు. ఆ విషయంలో యాంకర్ శివ, ఆర్జే చైతు ముందుంటున్నారు.
తాజాగా ముమైత్ ఖాన్, ఆర్జే చైతు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో భాగంగా మీకు పొద్దున్నే ఎవరి ముఖం చూడాలి అని లేదు అనే ప్రశ్నకు చైతు సమాధానం చెప్తాడు. అతను పొద్దున్నే ముమైత్ ఖాన్ ముకం చూడాలి అని నేను అనుకోవట్లేదు అంటాడు. ఆ సమాధానంతో ముమైత్ కు చిర్రెత్తుకొచ్చి.. నేను ఏదైతే కాదో ఆ ముద్ర నాపై వేస్తున్నావు అంటూ ఫైర్ అవుతంది.
ఆ విషయం గురించి వారిద్దరూ తమ మిత్రులతో చర్చించుకుంటారు. చైతు తను అన్న మాటలకు తాను పశ్చాతాపం పడట్లేదని తేల్చేశాడు. ముమైత్ మాత్రం చైతు పైకి మంచి అబ్బాయిగా నటిస్తున్నాడంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు నాకు తెలుగు సరిగ్గా రాదు కాబట్టి సరిపోయింది లేదంటే గుద్దుతా అంటూ రెచ్చిపోయింది. పొద్దున్నే లేచి సిగరెట్లు లేవంటూ ఏడిస్తూ ఉంటే చిరాకు రాదా అంటూ చైతు తనను తాని సమర్థించుకున్నాడు. ఛాలెంజర్స్ టీమ్ నుంచి అజయ్ ముమైత్ ఖాన్ ను ఓదార్చాడు. ఆర్జే- చైతు ముమైత్ ఖాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.