ఒక్క తెలుగులోనే కాకుండా పరిచయం చేసిన అన్ని భాషల్లో క్లిక్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో అయితే ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. మరోవైపు నాన్ స్టాప్ హంగామా అంటూ బిగ్ బాస్ ఓటీటీ కూడా ప్రారంభించారు. 12 వారాల్లో ఇప్పటికే దాదాపు 8 వారాలు పూర్తయ్యాయి. అటు బిగ్ బాస్ సీజన్ 6 కోసం ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొనే సభ్యులు అంటూ ఒక లిస్ట్ కూడా బయట చక్కర్లు కొడుతోంది. అయితే ఇక్కడ హోస్ట్ విషయంలో మాత్రం కొన్ని అనుమానాలు లేవనెత్తుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హోస్ట్ నాగార్జున కాదని చెబుతున్నారు.
ఇదీ చదవండి: రక్తదానం చేసిన అకీరా.. వ్యక్తిత్వంలో పవన్ ను తలపిస్తున్న వారసుడు!
బిగ్ బాస్ సీజన్ 5 విషయంలో టీమ్ సూపర్ సక్సెస్ సాధించింది. ఎందుకంటే అన్ని సీజన్లతో పోల్చుకుంటే సీజన్ 5కి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సీజన్ 6 మీద కూడా అదే తరహా అంచనాలు ఉన్నాయి. కానీ మధ్యలో బిగ్ బాస్ ఓటీటీ వల్ల లెక్కలు మారాయంటున్నారు. ఓటీటీకి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. వారియర్స్ vs ఛాలెంజర్స్ అంటూ స్టార్ట్ చేసినా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎక్కడో లెక్క తప్పింది. అటు హోస్ట్ నాగార్జున మీద కూడా ట్రోలింగ్ పెరిగిపోయింది. షో హిట్టు కాకపోవడంతో నాగార్జున హోస్టింగ్ ని కూడా విమర్శించడం ప్రారంభించారు.
ఈ ఓటీటీ ఎఫెక్ట్ తోనే సీజన్ 6 చేసేందుకు నాగార్జున సుముఖంగా లేడని తెలుస్తోంది. తాను ఇంక బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించనని చెప్పేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. నాగ్ నిర్ణయంతో బిగ్ బాస్ టీమ్ కొత్త హోస్ట్ వెతుకులాటలో పడినట్లు చెబుతున్నారు. అయితే లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కానీ, ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులు, పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండటంతో ఒప్పుకోవడం కష్టమనే చెప్పాలి. మరి, వేరే స్టార్ హీరో కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.