బిగ్ బాస్ సీజన్ 6 మొదలైపోయింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 సందడి చాలా గ్రాండ్ గా మొదలైంది. అయితే.. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎన్నో సినిమాలతో మెప్పించిన సుదీప.. ఓ ఈ పేరు వింటే తెలియదు కదా.. అదేనండి ‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీ ఫేమ్ పింకీ. సినిమాలలో పింకీగా చాలా ఫేమస్ అయ్యింది సుదీప. ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన పింకీ.. తెలుగు ప్రేక్షకులకు పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది. అలాగే తెలుగులో స్టార్ హీరోలందరి సినిమాలలో నటించింది.
ఇక బిగ్ బాస్ హౌస్ లోని రెండో సభ్యురాలిగా పింకీ చాలా క్లాస్ గా ఎంట్రీ ఇచ్చింది. తన భర్తతో ఉన్నటువంటి లవ్ స్టోరీని చెబుతూ తన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేసింది. అలాగే మొదటిసారి టీవీ తెరపై ఫుల్ ప్లెడ్జ్ గా అలరించేందుకు సిద్దమైన పింకి.. మొత్తానికి చాలా చక్కనిడ్రెస్సింగ్ స్టైల్ తో కూల్ గా అడుగుపెట్టింది. ఇక 35 ఏళ్ళ వయసున్న పింకీ.. చివరిసారిగా లెజెండ్ సినిమాలో బాలయ్య కోడలిగా మెరిసింది. దాదాపు అన్ని సినిమాలలో హీరోలకు చెల్లెలిగా నటించి సుదీపను పింకీ అంటేనే గుర్తిస్తారు ప్రేక్షకులు.
ఇదిలా ఉండగా.. దాదాపు 7 ఏళ్ళ తర్వాత పింకీ తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. అదికూడా బిగ్ బాస్ లో అడుగుపెట్టేసరికి ఎలా ఎంటర్టైన్ చేస్తుందా? లేదా టాస్కులు ఎలా ఫేస్ చేయబోతుంది? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదీగాక సోషల్ మీడియాలో కూడా పింకీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం ఆమెకు ప్లస్ అనే చెప్పాలి. ఓటింగ్స్ విషయంలో ఫ్యాన్స్ నుండి మంచి సపోర్ట్ లభించే అవకాశం ఉంది. మరి అచ్చ తెలుగమ్మాయిగా అందరికి దగ్గరైన నటి సుదీప.. బిగ్ బాస్ లో అందరిని మెప్పించి, అన్నింటిని దాటుకొని విజేతగా నిలుస్తుందా లేదా కామెంట్స్ లో తెలియజేయండి.